STOCKS

News


జీ వాటా కొనుగోలు రేసులో దిగ్గజాలు

Tuesday 26th February 2019
news_main1551155749.png-24331

ముంబై: జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అమెరికాకు చెందిన కేబుల్‌ దిగ్గజం, కామ్‌కాస్ట్‌(అమెరికాలో ఎన్‌బీసీ యూనివర్శల్‌ సంస్థను నిర్వహిస్తోంది), కామ్‌కాస్ట్‌ మాజీ సీఎఫ్‌ఓ మైకేల్‌ ఏంజెలాకిస్‌ నేత్వత్వంలోని 400 కోట్ల డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ, ఎటైర్స్‌,  సోనీ కార్ప్‌లను జీ కంపెనీ చర్చల నిమిత్తం షార్ట్‌లిస్ట్‌ చేసిందని సమాచారం.టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌,  భారత చమురు దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (జీ ఎంటర్‌టైన్మెంట్‌లో వాటా కొనుగోలు కోసం రంగంలో ఉన్న ఏకైక భారత కంపెనీ ఇదే)లు ఇప్పటికే తమ బిడ్‌లను సమర్పించాయి. కామ్‌కాస్ట్‌, అటైర్స్‌ కలిసి సంయుక్తంగా వాటా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. చైనాకు చెందిన టెన్సెంట్‌, ఆలీబాబాలు కూడా రంగంలోకి వస్తాయనే అంచనాలున్నాయి. కానీ, ఇంతవరకూ ఇవి ఎలాంటి బిడ్‌లు సమర్పించలేదు. 


జీ వాటా విక్రయ చర్చలు జోరుగానే సాగుతున్నాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. సంప్రదింపులు, మేనేజ్‌మెంట్‌లో చర్చలు అన్నీ విదేశాల్లోనే జరుగుతున్నాయని, కొన్ని చర్చలు సీరియస్‌గానే సాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని కంపెనీలు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాయని, సందర్భానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం కోసం వేచి చూస్తున్నాయని ఆ వర్గాలు వెల్లడించాయి. 

ఈ విషయాలపై కామ్‌కాస్ట్‌, సోనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. ఇలాంటి ఊహాజనిత వార్తలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని జీ ప్రతినిధి పేర్కొ‍న్నారు. వాటా విక్రయ ప్రక్రియ నిలకడగా కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదనపు విషయాలు వెల్లడించలేమని పేర్కొన్నారు. అటైర్స్‌, యాపిల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఎలాంటి స్పందన ఇప్పటివరకూ వ్యక్తం చేయలేదు. 

ఈ రేసులో సోనీ కార్పొ ముందంజలో ఉందని సమాచారం. వేగంగా వృద్ధి చెందుతున్న భారత టీవీ, మీడియా, వినోద రంగాల్లో కామ్‌కాస్ట్‌, అటైర్స్‌, యాపిల్‌.. వంటి సంస్థలకు చెప్పుకోదగ్గ ఉనికి లేదు. ఈ సంస్థలు ఆరంభంలో ప్రమోటర్లతో సమానమైన వాటాను కొనుగోలు చేసి, 3-5 ఏళ్ల తర్వాత పూర్తి వాటాను కొనుగోలు చేస్తాయని అంచనాలున్నాయి. 

వినోద, మీడియా రంగాల్లో వంద శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేయవచ్చు. అయితే సంక్లిష్టమైన, బహు భాషలతో కూడిన భారత మార్కెట్లో ఏ విదేశీ సంస్థకైనా స్థానిక భాగస్వామి తప్పనిసరి. 

జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో 50 శాతం వాటాను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించాలనుకుంటున్నట్లు గత ఏడాది నవంబర్‌లోనే కంపెనీ ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర వెల్లడించారు. 

కాగా గత ఏడాది కాలంలో జీ ఎంటర్‌టైన్మెంట్‌ షేర్‌ 23 శాతం కుదేలైంది. దీంతో ఈ కంపెనీలో వాటాను ప్రీమియమ్‌ ధరకు విక్రయించాలన్న సుభాష్‌ చంద్ర ఆశలు వమ్మయ్యాయి. ఈ కంపెనీలో దేశీ, విదేశీ సంస్థలతో కలుపుకొని ప్రమోటర్ల మొత్తం వాటా 41.62 శాతంగా ఉంది. దేశీయ ప్రమోటర్‌ సంస్థల వాటాలో 85 శాతం వరకూ బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల వద్ద తాకట్టులో ఉన్నాయి. 


భారత శాటిలైట్‌ టెలివిజన్‌ రంగంలో ముందుగానే ప్రవేశించిన కంపెనీల్లో సోనీ పిక్చర్స్‌నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్‌) ఒకటి. వివిధ జోనర్ల కొత్త చానెళ్లను ఆరంభించే జోరును ఇటీవలనే మరింతగా పెంచింది. రెండేళ్ల క్రితం జీ స్పోర్ట్స్‌ బిజినెస్‌ను రూ.2,400 కోట్లకు కొనుగోలు చేసి తాజ్‌ టెలివిజన్‌(టెన్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌)గా ప్రసారాలు చేస్తోంది. గత ఏడాది మరాఠి జనరల్‌ ఎంటర్‌టైన్మెంట్‌స్పేస్‌లోకి ప్రవేశించింది. 
ఇప్పుడు జీలో వాటా కొనుగోలు సోనీకి ఎంతగానే కలసివస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఎస్‌పీఎన్‌కు పట్టణ ప్రాంతాల్లోనే, హిందీ మాట్లాడే మార్కెట్లోనే వీక్షకులున్నారు. జీకి మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా పాతుకుపోయింది. మొత్తం భారత టెలివిజన్‌ వీక్షణ మార్కెట్లో జీ వాటా 20 శాతానికి పైగానే ఉంటుందని అంచనా. జీలో వాటాను వ్యూహాత్మక భాగస్వామికి విక్రయిస్తామని సుభాష్‌ చంద్ర వెల్లడించిన కొన్ని రోజులకే సోనీ కీలక అధికారులు-మైక్‌ హాప్కిన్స్‌(సోమీ పిక్చర్స్‌ టెలివిజన్‌ చైర్మన్‌), టోనీ విన్సిక్యెరా (సోనీ పిక్చర్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ చైర్మన్‌లు)లు సుభాష్‌ చంద్రను ఆయన నివాసంలో సందర్శించారు. 

ఇక బ్రియాన్‌ రాబర్ట్స్‌ నేతృత్వంలోని కామ్‌కాస్ట్‌ కంపెనీ మీడియా ఆస్తులను కొని, విక్రయించడం చేస్తోంఇ. ఈ కంపెనీ కేబుల్‌ నెట్‌వర్క్స్‌, బ్రాండ్‌బాండ్‌ అసెట్స్‌, కంటెంట్‌ ప్రొవైడర్స్‌, ఇంటర్నెట్‌ ప్రొవైడర్స్‌, యానిమేషన్‌ స్డూడియోలు వంటి మీడియా ఆస్తుల క్రయ, విక్రయాలు జరుపుతోంది. 



You may be interested

మైక్రోఫైనాన్స్ రుణాల్లో 43% వృద్ధి

Tuesday 26th February 2019

- క్యూ3లో రూ. 1.66 లక్షల కోట్లకు లోన్ పోర్ట్‌ఫోలియో న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం (క్యూ3)లో మైక్రోఫైనాన్స్ రంగం రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 1,66,284 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధితో పోలిస్తే 43.1 శాతం వృద్ధి నమోదు చేసింది. మైక్రోఫైనాన్స్ సంస్థల నెట్‌వర్క్ ఎంఎఫ్‌ఐఎన్‌ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొత్తం మైక్రోఫైనాన్స్ ఖాతాలు వార్షిక

థామస్‌ కుక్‌ చేతికి డిజిఫొటో

Tuesday 26th February 2019

51 శాతం వాటా కొనుగోలు  డీల్‌ విలువ రూ.289 కోట్లు  ముంబై: పర్యాటక సేవలందించే థామస్‌ కుక్‌ ఇండియా గ్రూప్‌...ఇమేజింగ్‌ సొల్యూషన్స్‌, సేవలందించే డిజిఫొటో ఎంటర్‌టైన్మెంట్‌ ఇమేజింగ్‌(డీఈఐ)లో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు విలువ రూ.289 కోట్లని థామస్‌ కుక్‌ ఇండియా తెలిపింది. ఈ కొనుగోలుకు నియంత్రణ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొంది. డీఈఐలో వాటా కొనుగోలుతో కొత్త వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నామని థామస్‌ కుక్‌ ఇండియా సీఎమ్‌డీ

Most from this category