STOCKS

News


నికో.. తప్పుకో!!

Monday 21st January 2019
news_main1548051531.png-23696


- భాగస్వామ్య సంస్థకు రిలయన్స్ నోటీసులు
- చెల్లింపుల్లో డిఫాల్ట్ అవఽడమే కారణం

న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌ క్షేత్ర అభివృద్ధి వ్యయాల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో వెంచర్ నుంచి తప్పుకోవాల్సిందిగా కెనడాకు చెందిన భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) నోటీసులిచ్చింది. ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్ క్లస్టర్ వంటి వాటి అభివృద్ధికి తన వంతుగా 5-6 బిలియన్ డాలర్లను సమకూర్చలేకపోవడం, రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ కావడం, కేజీ-డీ6 వెంచర్‌లో తన 10 శాతం వాటాలను కొనుక్కునే వారిని దొరకపుచ్చుకోవడంలో విఫలం కావడం తదితర అంశాలు ఇందుకు కారణం. సంయుక్త నిర్వహణ ఒప్పందం (జేవోఏ) ప్రకారం నికోకు డిఫాల్ట్ నోటీసులు జారీ చేసినట్లు ఇటీవలి మూడో త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ వెల్లడించింది. నిర్దిష్ట గడువులోగా కూడా చెల్లింపులు జరపకపోవడంతో జేవోఏ, ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్‌సీ) నుంచి తప్పుకోవాలంటూ తమతో పాటు మరో భాగస్వామ్య సంస్థ బీపీ కూడా నికోకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. అయితే, నికో వీటిని సవాల్ చేస్తూ.. ఆర్బిట్రేషన్‌ నోటీసులు పంపినట్లు రిలయన్స్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్‌కు 60 శాతం, బ్రిటన్‌కి చెందిన బీపీకి 30 శాతం, నికో రిసోర్సెస్‌కు వాటాలు ఉన్నాయి.



You may be interested

నేటి నుంచి దావోస్ సదస్సు

Monday 21st January 2019

డబ్ల్యూఈఎఫ్‌కు వస్తున్న దిగ్గజాలు భారత్ నుంచి 100 మంది పైగా సీఈవోల బృందం ట్రంప్‌, పుతిన్‌, మాక్రాన్‌, థెరిసా మే సదస్సుకు దూరం దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు సోమవారం (నేడు) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25 దాకా జరిగే ఈ సదస్సులో ప్రపంచ ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించేందుకు, పరిష్కార మార్గాలపై కసరత్తు చేసేందుకు వివిధ దేశాల అధినేతలు, విధాన కర‍్తలు,

సెన్సెక్స్‌ కీలకస్థాయి 36,470

Monday 21st January 2019

ఈ నెల తొలి రెండు వారాల్లో పరిమితశ్రేణిలో కదలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు...ముఖ్యంగా అమెరికా, యూరప్‌లు గతవారం బ్రేక్‌అవుట్‌ను సాధించి, ముందడుగు వేసాయి. ఇదేబాటలో భారత్‌ సూచీలు కొంత పెరిగినప్పటికీ, మూడు వారాల నిరోధాన్ని అధిగమించడంలో ఇబ్బంది పడుతున్నాయి.  అయితే ఇన్ఫోసిస్‌, ఐటీసీలకు తోడు ఇతర హెవీవెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు క్రితం వారం ర్యాలీ జరపడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం. మరో వారం రోజుల్లో వెల్లడికానున్న కేంద్ర

Most from this category