STOCKS

News


ప్రభుత్వ విధానాలే కంపెనీలకు పెద్ద రిస్కు..

Wednesday 12th September 2018
news_main1536729417.png-20183

ముంబై: రాబోయే మూడేళ్లలో కార్పొరేట్లు ఎదుర్కొనబోయే అతి పెద్ద రిస్కుల్లో ప్రభుత్వ విధానాలే ప్రధమ స్థానంలో ఉంఽడనున్నాయి. నియంత్రణ సంస్థల నిబంధనలను పాటించడం చాలా కీలకంగా మారినట్లు పలువురు చీఫ్ ఆఫీసర్స్ (సీఎక్స్‌వో) భావిస్తుండటమే ఇందుకు కారణం. కంపెనీలకు ఎదురయ్యే రిస్కుల్లో.. సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీపరమైనవి తరువాతి స్థానాల్లో ఉండనున్నాయి. డెలాయిట్ ఇండియా నిర్వహించిన రిస్క్ సర్వే 2018లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 44 శాతం సంస్థలు భవిష్యత్ అవకాశాలు, ఆదాయాలు పెంచుకునే విషయాల్లో రిస్కులను ఎదుర్కొంటుండగా.. 36 శాతం సంస్థలు నష్ట నివారణ, నిబంధనలు పాటించే లక్ష్యాల సాధనలోనూ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను అమలు చేస్తున్నాయి. మొత్తం మీద 44 శాతం సంస్థలు నియంత్రణ విధానాలను ప్రధాన రిస్కుగా భావిస్తుండగా, సైబర్‌ సెక్యూరిటీని 31 శాతం సంస్థలు, టెక్నాలజీపరమైన మార్పులను 25 శాతం పెద్ద రిస్కులుగా భావిస్తున్నాయి. అయితే, మూడేళ్ల తర్వాత ఈ ట్రెండ్ మారే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 



You may be interested

పీఎఫ్‌సీ లాభం రూ.1,373 కోట్లు

Wednesday 12th September 2018

న్యూఢిల్లీ: పవర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (పీఎఫ్‌సీ) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,373 కోట్ల నికర లాభం (స్టాండ్‌ అలోన్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.1,122 కోట్లతో పోలిస్తే 22 శాతం వృద్ధి సాధించామని పీఎఫ్‌సీ తెలిపింది. గత క్యూ1లో రూ.6,729 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.7,028 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు రూ.313

వణికిస్తున్న రూపాయి!

Wednesday 12th September 2018

పెట్రోలు నుంచి... బంగారం వరకు దిగుమతి చేసుకునే వస్తువులన్నిటికీ చెల్లించాల్సింది అమెరికన్‌ డాలర్లే!! ఆ డాలర్ల కోసం రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. కాకపోతే... 10 రోజుల కిందటి వరకూ ఒక డాలర్‌ కోసం 68-69 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే... ఇపుడది ఏకంగా 72-73 రూపాయల స్థాయికి చేరిపోయింది. ఫలితం... దిగుమతులన్నీ ఖరీదవుతున్నాయి. ఆ ప్రభావం దేశంలో తయారవుతున్న వస్తువుల పైనా పడుతోంది. మొత్తంగా రూపాయి పతనమవుతూ... అన్ని వస్తువుల

Most from this category