STOCKS

News


-ప్రభుత్వానికి రూ.1,143 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు

Saturday 23rd March 2019
news_main1553325637.png-24765

-ప్రభుత్వానికి రూ.1,143 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు
-26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు నికర లాభం 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సం‍స్థ ఆర్‌ఈసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేర్‌కు రూ.11 (110 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను  ప్రకటించింది. డివిడెండ్‌ చెల్లింపుల్లో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,143 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ప్రభుత్వానికి చెల్లించింది.  ఈ మొత్తానికి సమానమైన ఆర్‌టీజీఎస్‌  క్రెడిట్‌ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ ప్రభుత్వానికి అందజేసింది. ఈ క్రెడిట్‌ అడ్వైస్‌ను ఆర్‌ఈసీ సీఎమ్‌డీ అజీత్‌ కుమార్‌ అగర్వాల్‌, కేంద్ర విద్యుత్తు శాఖ సహాయ మంత్రి ఆర్‌.కె. సింగ్‌కు అందించారు. 

రూ.96,357 కోట్ల రుణాలు...
ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి కొత్త ప్రాజెక్ట్‌ల కోసం రూ.96,357 కోట్లు మంజూరు చేశామని, వీటిల్లో రూ.52,269 కోట్లు పంపిణీ చేశామని ఆర్‌ఈసీ వివరించింది. ఈ తొమ్మిది నెలల కాలంలో స్థూల లాభం 32 శాతం వృద్ధితో రూ.6,466 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,508 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  ప్రభుత్వ రంగానికి చెందిన నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), ఆర్‌ఈసీ, విద్యుత్తు రంగంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు బోర్డ్‌లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర/రాష్ట్ర విద్యుత్తు సంస్థలు, గ్రామీణ విద్యుత్తు సహకార, ప్రైవేట్‌ రంగ సంస్థలకు ఆర్థిక తోడ్పాటునందిస్తోంది. విద్యుత్తు రంగానికి చెందిన విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణి ప్రాజెక్ట్‌లకు, నవీకరణ విద్యుదుత్పత్తి ప్రాజెక్ట్‌లకు రుణాలందిస్తోంది.



You may be interested

కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం

Saturday 23rd March 2019

కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ఆరంభం -రూ.2,750 కోట్లు సమీకరణ  -సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ బాండ్ల జారీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. తమ లండన్‌ బ్రాంచ్‌ ఈ బాండ్లను జారీ చేస్తుందని, ఈ బాండ్ల ద్వారా 40 కోట్ల డాలర్లు(సుమారుగా రూ.2,750 కోట్లు) సమీకరించనున్నామని కెనరా బ్యాంక్‌ తెలిపింది. మీడియమ్‌ టర్మ్‌ నోట్‌ (ఎమ్‌టీఎన్‌) ప్రోగ్రామ్‌ కింద ఈ సీనియర్‌ అన్‌ సెక్యూర్డ్‌ బాండ్లు(మీడియన్‌ టర్మ్‌ నోట్స్‌)ను

ఎల్‌పీజీ వాహన వినియోగాన్ని ప్రోత్సహించాలి

Saturday 23rd March 2019

- కాలుష్య నియంత్రణకు ఇది కూడా చౌకైన ప్రత్యామ్నాయం - విధానపరమైన వెసులుబాటు చాలు.. సబ్సిడీలు అక్కర్లేదు - కేంద్రానికి ఆటో ఎల్‌పీజీ సంస్థల సమాఖ్య విజ్ఞప్తి న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆటో ఎల్‌పీజీ వంటి చౌకైన ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని ఇండియన్ ఆటో ఎల్‌పీజీ సంస్థల సమాఖ్య (ఐఏసీ) కోరింది. సబ్సిడీపై విక్రయించేందుకు విద్యుత్‌, హైబ్రీడ్ వాహనాల కోసం రూ. 10,000 కోట్ల

Most from this category