STOCKS

News


ఆర్‌ఈసీ లభం రూ.1,469 కోట్లు

Saturday 15th September 2018
news_main1536988266.png-20282

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ. 1,469 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ1లో సాధించిన నికర లాభం, రూ.1,076 కోట్లతో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఆర్‌ఈసీ తెలిపింది. ఆదాయం అధికంగా ఉండటం దీనికి కారణమని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.5,628 కోట్ల నుంచి రూ.6,319 కోట్లకు పెరిగిందని తెలిపింది. షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) రూ.5.45 నుంచి రూ.7.44కు పెరిగిందని వివరించింది. సమస్యాత్మక వ్యాపార పరిస్థితుల్లోనూ మంచి రుణ వృద్ధిని సాధించామని పేర్కొంది. గత ఏడాది జూన్‌ 30 నాటికి రూ.2.08 లక్షల కోట్లుగా ఉన్న రుణాలు ఈ ఏడాది జూన్‌ 30 నాటికి 16 శాతం వృద్ధితో రూ.2.42 లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది. నికర మొండి బకాయిలు 5.68 శాతం నుంచి 4.27 శాతానికి తగ్గాయని వివరించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కంపెనీ ఇండ్‌-యాస్‌(ఇండియన్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌)ను పాటిస్తోంది. 


REC

You may be interested

హోల్‌సేల్‌ బట్టల దుకాణం ‘టెక్స్‌ఫై’

Saturday 15th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: శ్రీనివాస్‌కు వరంగల్‌లో ఒక బట్టల దుకాణం ఉంది. చీరలు, డ్రెస్‌ల కోసం సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు వెళ్లి హోల్‌సేల్‌గా కొంటుంటాడు. వెళ్లడం నుంచి ఉత్పత్తుల ఎంపిక, లాజిస్టిక్, లావాదేవీలు.. ప్రతిదీ ఇబ్బందే! కానీ, ఇప్పుడు శ్రీనివాస్‌.. జస్ట్‌ తన షాపులో కూర్చొని వేరే రాష్ట్రాల్లోని ఉత్పత్తులను కొంటున్నాడు. అదే... టెక్స్‌ఫై.కామ్‌ ప్రత్యేకత. టెక్స్‌ఫైలో వివిధ రాష్ట్రాలకు చెందిన 300కు పైగా గార్మెంట్స్‌ తయారీ

క్యాడ్‌కు కళ్లెం... రూపాయికి జోష్‌!

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) పెరిగిపోకుండా చూడడం, పడిపోతున్న రూపాయి విలువకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర సర్కారు శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశీ రుణ నిబంధనలను సరళీకరించడంతోపాటు, అనవసర ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం, ఆంక్షలు విధించడం ఇందులో కీలకమైనవి.  ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక రంగ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌,

Most from this category