STOCKS

News


విలీనమైనా కూడా మా చేతిలోనే!!

Tuesday 19th February 2019
Markets_main1550561303.png-24256

  • తుది దశలో లావాదేవీ ప్రక్రియ 
  • ఆర్‌ఈసీపై కేంద్రం స్పష్టీకరణ

ముంబై:  రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కంపెనీని (ఆర్‌ఈసీ) పీఎఫ్‌సీ టేకోవర్‌ చేసినప్పటికీ, ఆర్‌ఈసీ ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ టేకోవర్‌ తుది దశలో ఉందని, లావాదేవీ ధర ఇంకా నిర్ణయం కాలేదని విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ వర్మ చెప్పారు. వచ్చే నెల 31లోపు ఈ లావాదేవీ పూర్తికావచ్చన్నారు. మైనారిటీ వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ను పొడిగించే ఆలోచనేదీ లేదని తెలియజేశారు. ఆర్‌ఈసీని టేకోవర్‌ చేసే పీఎఫ్‌సీ కూడా ప్రభుత్వ రంగ సంస్థేనని, ఆర్‌ఈసీపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాగా ఆర్‌ఈసీ కొనుగోలుకు కావలసిన నిధులను మార్కెట్‌ రుణాల ద్వారా సమీకరిస్తామని పీఎఫ్‌సీ సీఎమ్‌డీ రాజీవ్‌ శర్మ చెప్పారు. ఆర్‌ఈసీ భౌగోళికంగా బాగా విస్తరించిందని, విద్యుత్‌ పంపిణీ, ప్రసారం విభాగాల్లో మంచి నైపుణ్యం సాధించిందని పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీని కొనుగోలు చేయడం తమకు ప్రయోజనకరమేనన్నారు.



You may be interested

వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు!

Tuesday 19th February 2019

వేదాంతాకు సుప్రీంలో చుక్కెదురు! ట్యుటికొరిన్‌ ప్లాంటు పునఃప్రారంభానికి నో జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు కొట్టివేత హైకోర్టుకు వెళ్లవచ్చని వేదాంతాకు సూచన న్యూఢిల్లీ: తమిళనాడులోని ట్యుటికోరిన్‌లో స్టెరిలైట్‌ కర్మాగారాన్ని పునఃప్రారంభానికి అత్యున్నత న్యాయస్థానం రెడ్‌ సిగ్నల్‌ వేసింది. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎస్‌జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది. దీనీతో ఈ ప్లాంట్‌ పునఃప్రారంభానికి వేదాంతా చేస్తున్న తక్షణ ప్రణాళికలకు విఘాతం ఏర్పడినట్లయ్యింది. అయితే ఈ అంశంపై హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు సూచించడం వేదాంతాకు

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.28వేల కోట్లు!

Tuesday 19th February 2019

మధ్యంతర డివిడెండ్‌ రూపంలో వెసులుబాటు అంతక్రితం ఆర్‌బీఐ బోర్డ్‌నుద్దేశించి ప్రసంగించిన జైట్లీ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి) ‍కేంద్రం ద్రవ్యలోటు (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసం) ఇబ్బంది నుంచి కొంతమేర బయటపడే కీలక నిర్ణయాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. రూ. 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ మంత్రి

Most from this category