STOCKS

News


మరో 200 మంది నియామకం:రియల్‌పేజ్‌

Saturday 17th November 2018
news_main1542432428.png-22119

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: రియల్‌ ఎస్టేట్‌ రంగానికి సాఫ్ట్‌వేర్‌, డేటా అనలిటిక్స్‌ సేవలు అందిస్తున్న రియల్‌పేజ్‌ వచ్చే ఏడాదిలోగా మరో 200 మందిని నియమించుకోనుంది. యూఎస్‌కు చెందిన ఈ సంస్థకు హైదరాబాద్‌ కార్యాలయంలో 1,000 మంది ఉద్యోగులు ఉన్నారు. డేటా అనలిటిక్స్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెల్లిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ విభాగాల్లో ఇక్కడి టీమ్‌ నైపుణ్యత సంస్థ విస్తరణలో కీలకమని రియల్‌పేజ్‌ సీవోవో అశ్లే గ్లోవర్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 12,300 క్లయింట్లు ఉన్నారు.



You may be interested

14 దేశాలకు విస్తరించిన ‘ప్రీతి’

Saturday 17th November 2018

సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగు దశాబ్దాలుగా వంటింటి ఉపకరణాల్లో దిగ్గజ బ్రాండ్‌గా రాణిస్తున్న ఫిలిప్స్‌ ఇండియా అనుబంధ సంస్థ ‘ప్రీతి’ కిచెన్‌ అప్లయన్సెస్‌ ఉత్పత్తులు, ప్రస్తుతం 14 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు సంస్థ ఎండీ సుబ్రమణియన్‌ శ్రీనివాసన్‌ చెప్పారు. 1978లో ఏర్పాటు చేసిన ప్రీతి సంస్థ 40వ వార్షికోత్సవం సందర్బంగా 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రీతి ఉత్పత్తుల తయారీ ప్లాంట్‌ను ‘రాయల్‌ ఫిలిప్స్‌’

క్వాలిటీ షేర్లు ఇవేనంటున్న ఆనంద్‌ రాఠీ..!

Saturday 17th November 2018

ముంబై: ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల నుంచి 20 శాతం పతనంకావడం అనేది భారత స్టాక్‌ మార్కెట్లకు అతిపెద్ద రిలీఫ్‌ అని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ అడ్వైజరీ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ సిద్ధార్థ్‌ సెడానీ అన్నారు. ఈ ఒక్క సానుకూలంశం స్థూల ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలను చక్కబెడుతుందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషించిన ఆయన ఈనెలలోనే మార్కెట్‌ స్థిరీకరణకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

Most from this category