STOCKS

News


రూ. 260 కోట్లు కడతాం... అనుమతివ్వండి

Friday 22nd February 2019
Markets_main1550826022.png-24277

- ఎరిక్సన్‌ బకాయిలపై బ్యాంకుల్ని కోరిన ఆర్‌కామ్
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్వీడన్ టెలికం సంస్థ ఎరిక్సన్‌కు బాకీల చెల్లింపుల కోసం రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) నిధుల సమీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆదాయ పన్ను రిఫండ్ ‍ద్వారా తమ బ్యాంక్ ఖాతాకు వచ్చిన రు.260 కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించేందుకు సత్వరం అనుమతివ్వాలంటూ రుణదాతలను అభ్యర్థించింది. "ఇన్‌కమ్‌ ట్యాక్స్ రిఫండ్స్ రూపంలో వచ్చిన సుమారు రూ.260 కోట్లను బ్యాంక్ ఖాతా నుంచి ఎరిక్సన్‌కు బదలాయించేందుకు తక్షణం అనుమతినివ్వాలని రుణదాతలను కోరాం" అంటూ ఆర్‌కామ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే కోర్టుకు రూ.118 కోట్లు డిపాజిట్ చేశామని, మరో రూ.200 కోట్లు సమీకరిస్తున్నామని ఆర్‌కామ్ తెలిపింది. సుప్రీం కోర్టు ఇచ్చిన నాలుగు వారాల గడువులోగా ఎరిక్సన్‌కు రూ.550 కోట్ల బాకీ, వడ్డీతో సహా చెల్లించగలమన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్‌ కామ్‌.. ప్రస్తుతం దివాలా ప్రక్రియ అమలు కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్‌సీఎల్‌టీ) ఆశ్రయించాలని నిర్ణయించుకోవడంతో.. ఏ చెల్లింపులు జరపాలన్నా తప్పనిసరిగా రుణదాతల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 


ఎరిక్సన్‌కు ఆర్‌కామ్‌ కట్టాల్సిన రూ.550 కోట్ల బాకీలపై సుప్రీంకోర్టు బుధవారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా కోర్టు ఆదేశాల ధిక్కారానికి పాల్పడిన ఆర్‌కామ్ నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు కట్టాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లేని పక్షంలో ఆర్‌కామ్‌ చైర్మన్ అనిల్‌ అంబానీ మూడు నెలలు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర్వులు ఇచ్చింది. 


నిప్పన్‌ లైఫ్‌లో వాటాల విక్రయం...
మరోవైపు, నిధుల సమీకరణ ప్రయత్నాల్లో భాగంగా నిప్పన్‌ లైఫ్‌తో ఉన్న జాయింట్ వెంచర్‌ సంస్థలో వాటాలను భాగస్వామ్య సంస్థకే విక్రయించాలని రిలయన్స్ క్యాపిటల్ భావిస్తోంది. రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఆర్‌నామ్‌)లో తమకున్న 42.88 శాతం వాటాలను కొనుగోలు చేయాల్సిందిగా భాగస్వామ్య సంస్థ నిప్పన్ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు ఆఫర్ ఇచ్చినట్లు సంస్థ వెల్లడించింది.



You may be interested

శామ్‌సంగ్‌... ఫోల్డ్‌ చేసే ఫోను

Friday 22nd February 2019

ధర రూ.1.4 లక్షలు శాన్ ఫ్రాన్సిస్కో: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ కంపెనీ శాంసంగ్‌.. అధునాతన టెక్నాలజీతో తన మొట్ట మొద‌టి మడత పెట్టగల (ఫోల్డబుల్‌) స్మార్ట్‌ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. ‘గెలాక్సీ ఫోల్డ్‌’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్‌ నుంచి వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇది ట్యాబ్‌గా, ఫోన్‌గా కూడా ఉపయోగపడనుందని కంపెనీ వెల్లడించింది. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేయగలిగిన ఈ మొబైల్‌ డిస్‌ప్లే సైజ్ 4.6

వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు?

Friday 22nd February 2019

- బ్యాంకర్లకు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ప్రశ్న - బ్యాంకింగ్‌ అధికారులతో భేటీ - రేట్ల కోత లాభం కస్టమర్లకు చేరాలని స్పష్టీకరణ ముంబై: బ్యాంకులు వడ్డీరేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు. పాలసీ రేటు తగ్గింపు అమల్లో జాప్యం ఎందుకని ఆయన బ్యాంకర్లను ప్రశ్నించారు. శక్తికాంతదాస్‌ గురువారం ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్ల చీఫ్‌లతో సమావేశమయ్యారు. రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే

Most from this category