STOCKS

News


ఆర్‌కామ్‌-ఆర్‌జియో ఒప్పందం రద్దు

Tuesday 19th March 2019
Markets_main1552979867.png-24690

అనుమతులు రాకపోవడం వల్లే
న్యూఢిల్లీ: అంబానీ సోదరులకు చెందిన టెలికం కంపెనీలు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (అనిల్‌ అంబానీ), రిలయన్స్‌ జియో (ముకేశ్‌ అంబానీ) టెలికం ఆస్తులకు సంబంధించి 15 నెలల క్రితం తాము చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్టు ప్రకటించాయి. ప్రభుత్వం, రుణదాతల నుంచి అనుమతుల్లో జాప్యాన్ని కారణంగా పేర్కొ‍న్నాయి. 15 నెలల కాంలో 45 సమావేశాలు జరిగిన తర్వాత కూడా ఆర్‌కామ్‌కు రుణాలు ఇచ్చిన దేశ విదేశీ బ్యాంకులు ఆర్‌కామ్‌, జియో మధ్య లావాదేవీకి అనుమతివ్వకపోవడంతోపాటు టెలికం శాఖ నుంచి ఆమోదం కూడా రాని విషయాన్ని ప్రస్తావించింది. సంస్థకు చెందిన మొత్తం రుణ సమస్యకు వేగంగా దివాలా పరిష్కారాన్ని కోరాలని ఆర్‌కామ్‌ బోర్డు గత ఫిబ్రవరి 1న నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌కామ్‌ ఆస్తులను విక్రయించకుండా, బదిలీ చేయకుండా ఎన్‌సీఎల్‌ఏటీ గత నెల 4న ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌కామ్‌ గ్రూపు రుణాలకు సంబంధించి ఎన్‌సీఎల్‌టీ ద్వారా సమగ్ర పరిష్కారాన్ని చూపేందుకు కట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది. జియోకు తన టెలికం ఆస్తులను విక్రయించడం ద్వారా రుణ భారంలో సగాన్ని తీర్చివేయాలన్నది అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ భావించింది. ఈ సంస్థకు రూ. 46,000 కోట్ల వరకు రుణ భారం ఉంది.



You may be interested

సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌

Tuesday 19th March 2019

స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతున్న మార్కెట్లో మంగళవారం సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ నెలకొంది. ఇటీవల మౌలిక సదుపాయాల రంగం జోరందుకోవడంతో మార్కెట్లో సిమెంట్‌ షేర్లకు డిమాండ్‌ కొనసాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యధికంగా ఇండియా సిమెంట్‌ 4.50శాతం లాభపడింది. రైన్ ఇండస్ట్రీస్‌ 3.50శాతం, ప్రిజం సిమెంట్స్‌ 3శాతం లాభపడ్డాయి. జే.కే సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. అలాగే అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసీం, ఏసీసీ సిమెంట్స్‌ షేర్లు 1శాతం

52 షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌!

Tuesday 19th March 2019

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 52 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో టాటా మోటర్స్‌, స్టెరిలైట్‌ టెక్‌, రిలయన్స్‌ నావల్‌, జైప్రకాశ్‌ పవర్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ హిందుస్థాన్‌, డెల్టా కార్‌‍్ప, బాటా ఇండియా, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, గాయత్రి ప్రాజెక్ట్స్‌, అపోలో

Most from this category