STOCKS

News


యస్‌ బ్యాంక్‌ కపూర్‌కు ఆర్‌బీఐ నో

Thursday 20th September 2018
news_main1537427239.png-20403

  • ఆర్‌బీఐ ఆదేశాలు
  • 2019 జనవరి తుది గడువుగా నిర్దేశం-

న్యూఢిల్లీ: ఎస్‌ బ్యాంక్‌ చీఫ​ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రాణా కపూర్‌ పదవీకాలాన్ని బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కుదించింది. 2019 జనవరి నాటికి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రైవేటు దిగ్గజ బ్యాంక్‌కు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2004లో బ్యాంకును ప్రారంభించినాటి నుంచీ రాణా కపూర్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021 ఆగస్టు 31 వరకూ పదవీ కాలాన్ని పొడిగించాలని కపూర్‌ చేసిన విజ్ఞప్తిని ఆర్‌బీఐ తిరస్కరించింది. 2019 జనవరి వరకే కొనసాగడానికి అనుమతిని ఇచ్చింది.  

25న బ్యాంక్ బోర్డ్‌ సమావేశం...
అయితే ఈ అంశంపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించడానికి బ్యాంక్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఈ నెల 25న సమావేశం కానున్నారు. యస్‌ బ్యాంక్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌బీఐ తుది ఆమోదానికి లోబడి, కపూర్‌ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించడానికి ఈ ఏడాది జూన్‌లో బ్యాంక్‌ షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. నిజానికి ఆయన ప్రస్తుత పదవీకాలం ఆగస్టు 31తో ముగిసింది. అయితే తదుపరి నోటీసు వచ్చే వరకూ బాధ్యతల్లో కొనసాగడానికి ఆగస్టు 30న ఆర్‌బీఐ అనుమతి జారీచేసింది. అప్పట్లో నిర్దిష్ట సమయాన్ని వెల్లడించని ఆర్‌బీఐ, తాజాగా ఇందుకు 2019 జనవరిని తుది గడువుగా ప్రకటించింది. ప్రమోటర్‌గా కపూర్‌ ఆయన కుటుంబానికి బ్యాంక్‌లో 10.66 శాతం వాటా ఉంది.

శిఖా శర్మ తరహాలోనే:- గతంలో కూడా ప్రైవేటు రంగ మూడవ దిగ్గజ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌- సీఈఓ శిఖా శర్మ పదవీ కాలం మూడేళ్ల పొడిగింపునకు బోర్డ్‌ ఆమోదముద్ర వేసింది. దీనికి ఆర్‌బీఐ అంగీకరించలేదు.



You may be interested

రూపాయి‘‘బూస్ట్‌’’కు ఆర్‌బీఐ చర్యలు

Thursday 20th September 2018

విదేశీ నిధుల సమీకరణ  నిబంధనల సరళతరం తయారీ కంపెనీలకు ప్రోత్సాహం మసాలా బాండ్స్‌ మార్కెట్‌కూ- బ్యాంకులకు అనుమతి ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలోపేత చర్యలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తయారీ రంగంలో కంపెనీలు విదేశీ నిధుల సమీకరించుకోడానికి (ఈసీబీ) సంబంధించిన నిబంధనలను బుధవారం సడలించింది. అలాగే రూపీ డినామినేటెడ్‌ బాండ్లు  (మాసాలా బాండ్స్‌) మార్కెట్‌కూ ఇండియన్‌ బ్యాంక్‌లకు అనుమతినిచ్చింది. గత శనివారం రూపాయి బలోపేతానికి ప్రధాని

10 ప్రభుత్వ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు

Thursday 20th September 2018

ఐదు బ్యాంకులకు ఎస్‌బీఐ నుంచే న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం బుధవారం ఎండీ, సీఈఓలను నియమించింది. కొత్త చీఫ్‌లలో ఐదుగురు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లు  కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని నియామక వ్యవహారాల క్యాబినెట్‌ ‍కమిటీ ఈ నియామకాలకు ఆమోదముద్ర వేసింది. నియామక వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీచేసిన  అధికారిక ఉత్తర్వులను క్లుప్తంగా చూస్తే... ఎస్‌బీఐ నుంచీ వీరు...     మొండిబకాయిలతో సతమతమవుతున్న ఇతర

Most from this category