STOCKS

News


త్వరలో కొత్త రూ.20 నోటు విడుదల

Wednesday 26th December 2018
news_main1545799127.png-23233

న్యూఢిల్లీ: అదనపు ఫీచర్లతో కూడిన కొత్త 20 రూపాయిల నోట్లను ఆర్‌బీఐ త్వరలోనే వ్యవస్థలోకి తీసుకురానుంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్‌బీఐ అప్పటి వరకు వ్యవస్థలో లేని రూ.2,000, రూ.200 నోట్లతోపాటు, కొత్త రూపంలో రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 కరెన్సీ నోట్లను తీసుకొచ్చింది. మహాత్మాగాంధీ సిరీస్‌ కింద వీటిని 2016 నవంబర్‌ తర్వాత తీసుకొచ్చింది. పాత నోట్లతో పోలిస్తే ఇవి రూపంలోనూ, సైజులోనూ భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. రూ.20 నోటు మాత్రం కొత్త రూపంలో ఇంత వరకు రాలేదు. ఆర్‌బీఐ ఇప్పుడు దీన్ని కూడా చలామణిలోకి తీసుకురానుంది. 2016 మార్చి నాటికి వ్యవస్థలో 492 కోట్ల రూ.20 నోట్లు చలామణిలో ఉన్నాయి. 2018 మార్చి నాటికి ఈ సంఖ్య కాస్తా 1,000 కోట్లకు పెరిగింది. ఈ ఏడాది మార్చి నాటికి వ్యవస్థలో చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.20 నోట్ల వాటా 9.8 శాతంగా ఉందని ఆర్‌బీఐ సమాచారం తెలియజేస్తోంది. 



You may be interested

8 వరకూ ఒలెక్ట్రా ఓపెన్‌ ఆఫర్‌!

Wednesday 26th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ అమల్లోకి వచ్చింది. ఈ ఆఫర్‌ జనవరి 8న ముగుస్తుంది. ఒలెక్ట్రాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం ప్రమోటింగ్‌ కంపెనీలైన ఎంఈఐఎల్‌ హోల్డింగ్స్‌తో పాటు మేఘా ఇంజనీరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు కంపెనీలో మరో 26 శాతం వాటాను షేర్‌ హోల్డర్ల నుంచి ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చి కొనుగోలు

క్రూడ్‌, డాలర్‌ డౌన్‌.. రూపీ అప్‌..

Wednesday 26th December 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం లాభాలతో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 69.88 వద్ద ఆరంభమైంది. రూపాయి సోమవారం ముగింపు స్థాయి 70.13గా ఉంది. కాగా మంగళవారం క్రిస్మస్‌ సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు.  క్రూడ్‌ ధరలు పతనం కావడం మన కరెన్సీకి కలిసొచ్చింది. అలాగే అమెరికాలో రాజకీయ అస్థిరతల వల్ల డాలర్‌పై ఒత్తిడి నెలకొంది. దీంతో రూపాయికి బలం చేకూరింది. క్రూడ్‌ ధరలు బ్యారెల్‌కు 55 డాలర్ల దిగువునే ట్రేడ్‌ అయితే..

Most from this category