STOCKS

News


కరెన్సీ నోట్లను గుర్తించేందుకు మొబైల్ యాప్‌

Monday 15th July 2019
news_main1563170191.png-27063

  • ఆర్‌బీఐ కసరత్తు

న్యూఢిల్లీ: చూపులేని వారు సైతం కరెన్సీ నోట్లను సులభంగా గుర్తించగలిగేలా ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేవడంపై రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. దీని రూపకల్పన కోసం యాప్స్ తయారీ సంస్థల నుంచి బిడ్స్‌ ఆహ్వానించింది. మొబైల్ ఫోన్ కెమెరా ముందు నోటును ఉంచితే.. దాని విలువను తెలియజేసే విధంగా యాప్‌ ఉండాలని ప్రతిపాదించింది. ఒకవేళ కరెన్సీ నోటును కెమెరా ముందు సరైన యాంగిల్‌లో ఉంచని పక్షంలో ఆ విషయాన్ని కూడా తెలియజేసేలా సదరు యాప్‌ ఆడియో నోటిఫికేషన్‌ కూడా ఇచ్చేలా ఉండాలి. ప్రస్తుతం రూ. 1, 10, 20, 50,100, 200, 500, 2000 కరెన్సీ నోట్లు చలామణీలో ఉన్నాయి. చూపులేని వారు కూడా గుర్తించే విధంగా రూ. 100 ఆ పైన విలువ చేసే కరెన్సీ నోట్లపై నిర్దిష్ట భాగం ఉబ్బెత్తుగా ఉండేలా ముద్రిస్తున్నారు. పూర్తిగా, లేదా పాక్షికంగా చూపులేని వారి సంఖ్య దేశీయంగా దాదాపు 80 లక్షల దాకా ఉంటుందని అంచనా. ఆర్‌బీఐ యాప్ ప్రతిపాదన..  వీరందరికీ ఉపయోగపడనుంది.



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల ఆస్తుల కొనుగోలుపై త్వరలోనే మార్గదర్శకాలు

Monday 15th July 2019

న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ రంగం లిక్విడిటీ సమస్యల్లో ఉండడంతో, ఈ రంగంలోని కంపెనీల నుంచి రుణ ఆస్తులను కొనుగోలు చేసే విషయమై ప్రభుత్వరంగ బ్యాంకులకు త్వరలోనే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఆర్థిక శాఖలోని రెండు ప్రధాన విభాగాల మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తుల కొనుగోలు అర్హత నిబంధనలను ఈ వారం లేదా వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు.

కంపెనీగా కొనసాగలేమేమో !

Monday 15th July 2019

ఆందోళన వ్యక్తం చేసిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ క్యూ4లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు  కంపెనీకి ఇవే అత్యధిక నష్టాలు  న్యూఢిల్లీ: గత కొన్ని క్వార్టర్లలో జరిగిన పరిణామాల కారణంగా,.. భవిష్యత్తులో కంపెనీగా కొనసాగలేమోనన్న ఆందోళనను హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వ్యక్తం చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2018-19) నాలుగో క్వార్టర్‌లో రూ.2,224 కోట్ల నికర నష్టాలు వచ్చాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తెలిపింది. రూ.3,280 కోట్ల అదనపు కేటాయింపుల కారణంగా ఈ స్థాయిలో నష్టాలొచ్చాయని, తమ కంపెనీ చరిత్రలో

Most from this category