STOCKS

News


యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ డేగకన్ను!?

Thursday 16th May 2019
news_main1557988133.png-25765

గాంధీ నియామకమే నిదర్శనం
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ఆర్‌గాంధీని యస్‌బ్యాంక్‌ అదనపు డైరెక్టర్‌గా ఆర్‌బీఐ నియమించింది. ఈ నియమాకంతో యస్‌బ్యాంక్‌పై మరింత నిశిత పరిశీలన జరపాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మేనేజ్‌మెంట్‌ చేపట్టిన క్లీనప్‌ కార్యక్రమానికి అండగా ఉండేందుకు గాంధీని నియమించారని భావిస్తున్నారు. బ్యాంకుపై ఆర్‌బీఐకున్న అనుమానాలను ఈ నియామకం ధృవపరుస్తోందని విశ్లేషకులు అనుకుంటున్నారు. గాంధీ నియామకం అంతిమంగా ఇన్వెస్టర్లకు మేలు చేయకపోవచ్చని ఎక్కువమంది భయపడుతున్నారు. ఈ భయాలతోనే బుధవారం బ్యాంకు షేరు దాదాపు 8 శాతం పతనమైంది. గతంలో బ్యాంకు బిలియన్‌ డాలర్లను సంస్థాగత మదుపర్ల నుంచి సమీకరించాలని భావించి చివరకు నియంత్రణపరమైన సమస్యల కారణంగా వెనక్కి తగ్గింది. ప్రస్తుతం బిలియన్‌ డాలర్ల సమీకరణకు బోర్డు అనుమతి ఇప్పటికే ఉన్నా కూడా బ్యాంకు షేరు ధర బాగా క్షీణించడంతో సమీప భవిష్యత్‌లో సమీకరణ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే మదుపర్లకు ఆందోళనకర అంశంగా మారింది. ఇపుడు ఆర్‌బీఐ డైరెక్టరును యెస్‌ బ్యాంకు బోర్డులోకి వచ్చిన నేపథ్యంలో సమీకరణ మరింత ఆలస్యమవుతుందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేనందున నిధుల సమీకరణ అత్యంత ఆవశ్యకంగా మారింది. కానీ తాజా మార్పులతో ప్రస్తుతానికి నిధుల సమీకరణ అన్నది జరగడం కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌లకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడంతో తాజా ఫలితాల్లో బ్యాంకు గణాంకాలు డీలా పడ్డాయి. సెప్టెంబరులో రాణాకపూర్‌కు మరో మూడేళ్ల పాటు పదవీ కాలాన్ని పొడిగించడానికి ఆర్‌బీఐ నిరాకరించడంతో.. కపూర్‌ వారసుడిగా వచ్చిన రవ్‌నీత్‌ గిల్‌ బ్యాంకును ప్రక్షాళించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఫలితాలు ఇంకా ఫలించలేదు. పైగా బ్యాంకు క్రెడిట్‌ కాస్టు భారీగ పెరుగుతోంది. మంగళవారం నుంచి గాంధీ బోర్డులోకి వస్తారు. రెండేళ్ల పాటు ఈయన ఈ పదవిలో ఉంటారు.  కస్టమర్లు బ్యాంకు ప్రయోజనాలను కాపాడడం కోసం గాంధీ నియామకాన్ని చేపట్టినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నియామకం ద్వారా రాబోయే త్రైమాసికాల్లో యెస్‌ బ్యాంకు ఖాతాలను మరింతగా ప్రక్షాళించాలన్నది ఆర్‌బీఐ ఉద్దేశంగా ఉందని విశ్లేషకుల భావన. అదే జరిగితే ఫలితాలు స్తబ్దుగా, మొండి బకాయిలు ఎక్కువగా నమోదవుతాయి. దీంతో ఇప్పటికే కుదేలై ఉన్న బ్యాంకు షేరు మరింత పతనమయ్యే ఛాన్సులున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాంధీ నియామకం, రేటింగ్‌ ఏజన్సీలు బ్యాంకు రేటింగ్‌ తగ్గించడం తదితరాలన్నీ బ్యాంకు విత్త పరిస్థితిపై ఆందోళన సంకేతాలను ఇస్తున్నాయి. అందువల్ల షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు పలువురు విశ్లేషకులు తెలిపారు. గతంలో ధనలక్ష్మీ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ ఇలాగే తన తరఫున డైరెక్టర్లను నియమించింది. You may be interested

1300డాలర్ల దిగువనే పసిడి

Thursday 16th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1300డాలర్ల దిగువను స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి అరశాతం స్వల్పనష్టంతో 1,297.45డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా వాణిజ్య యుద్ధంలో భాగంగా చైనా టెలికాం దిగ్గజం హువాయి కంపెనీపై సుంకాన్ని విధించింది. దీంతో అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు ఆశలు సన్నగిల్లాయి. ఈక్విటీ మార్కెట్లో అంతర్లీనంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు పసిడి ర్యాలీకి సహకరిస్తాయి. స్వల్పకాలంలో

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు యూనియన్‌ బ్యాంక్‌ ఇండియా:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.6వేల కోట్ల మూలధన నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం మూలధన సమీకరణలో రూ.4,900 కోట్లను ఈక్వీటీ షేర్ల జారీ ద్వారా సమీకరించనుంది. లుపిన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ మహారాష్ట్రలోని ఔరంగబాద్‌ ప్లాంట్‌లో తనిఖీలు పూర్తి చేసింది. ప్లాంట్‌ నిర్వహణ లోపాల్ని గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లు జారీ చేసినట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం

Most from this category