News


డేటా లోకలైజేషన్‌కి నేటితో గడువు పూర్తి

Monday 15th October 2018
news_main1539581421.png-21153

న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు భారత్‌లోని తమ కస్టమర్లు నిర్వహించే లావాదేవీల డేటాను దేశీయంగానే స్టోర్ చేయాలంటూ (డేటా లోకలైజేషన్‌) రిజర్వ్ బ్యాంక్ విధించిన గడువు సోమవారంతో ముగుస్తోంది. ఆర్‌బీఐ దీన్ని మళ్లీ పొడిగించే అవకాశాలేమీ లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. డేటా లోకలైజేషన్‌ నిబంధనలను అమలు చేయడానికి అంతర్జాతీయ పేమెంట్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆరు నెలల గడువు అక్టోబర్ 15తో ముగియనుంది. దేశీ సంస్థలు ఇందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, లోకలైజేషన్ నిబంధనతో తమ వ్యయాల భారం మరింత పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. గడువు పొడిగించాలంటూ ఆర్‌బీఐని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు అమెరికా ప్రభుత్వం సైతం డేటా లోకలైజేషన్‌కు తాము వ్యతిరేకమని పేర్కొంది. లోకలైజేషన్ నిబంధనల ప్రకారం ఫిన్‌టెక్ సంస్థలు సేకరించిన స్థానికుల సమాచారాన్ని ఇతర దేశాలకు తరలించడానికి ముందు భారత్‌లోనే స్టోర్‌ చేయాల్సి ఉంటుంది. దేశీ ప్రైవసీ, డేటా భద్రత చట్టాలకు లోబడి విదేశాలకు బదిలీ చేసేందుకు అనుమతులు పొందాల్సి ఉంటుంది. 



You may be interested

ఫలితాలు, రూపాయి కదలికలే కీలకం..!

Monday 15th October 2018

ముంబై: శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత వెల్లడైన సీపీఐ, ఐఐపీ డేటా సోమవారం మార్కెట్‌ దిశపై ప్రభావం చూపనుందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదైంది. గడిచిన మూడు నెలల కాలంలో అత్యంత కనిష్ట స్థాయికి చేరుకుంది. ఐఐపీ గణాంకాలు నిరాశపరచగా.. సెప్టెంబర్‌ వినియోగ ధరల సూచీ  (సీపీఐ) ఆధారిత రిటైల్‌

మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘సిప్‌’ పెట్టుబడుల్లో భారీ వృద్ధి

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్‌లో ఉన్నాగానీ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు గుమ్మరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు సెప్టెంబర్‌ నెలలో సిప్‌ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన నిధులతో పోలిస్తే 40 శాతం అధికంగా రూ.7,727 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. అంటే, మార్కెట్ల కరెక్షన్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశంగా చూసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.7,658 కోట్లు,

Most from this category