STOCKS

News


ఎస్‌బీఐపై రూ.7 కోట్ల జరిమానా విధించిన ఆర్‌బీఐ

Tuesday 16th July 2019
news_main1563259546.png-27092

ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.7 కోట్ల జరిమానా విధించింది. నిరర్థక ఆస్తుల గుర్తింపునకు సంబంధించిన నిబంధనలను పాటించకపోవడం వల్లే ఈ మేరకు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ సోమవారం ప్రకటించింది. ఆదాయ గుర్తింపు, ఆస్తి వర్గీకరణ (ఐఆర్‌ఏసీ) నిబంధనలు.. కరెంట్‌ ఖాతాలను తెరవడం, నిర్వహించడానికి సంబంధించిన డేటాను సీఆర్‌ఐఎల్‌సీకి అందించడంలో ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతో పాటు మోసాలకు అవకాశం ఉన్నటువంటి సమాచారాన్ని అందించనందుకు పేర్కొన్న మొత్తంలో పెనాల్టీ విధించింది.



You may be interested

రెండేళ్ల కనిష్టానికి టోకు ధరలు

Tuesday 16th July 2019

  జూన్‌లో 2.02 శాతం అన్ని సూచీల్లో తగ్గిన స్పీడ్‌ న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల స్పీడ్‌) 2019 జూన్‌లో 2.02 శాతం పెరిగింది. అంటే 2018 ఇదే నెలతో పోల్చితే ఈ బాస్కెట్‌ మొత్తం ధర కేవలం 2.02 శాతమే పెరిగిందన్నమాట. గడచిన 23 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల పెరుగుదల రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. టోకున విద్యుత్‌, ఇంధన, తయారీ

జీవీకే ఎయిర్‌పోర్టులో 49 శాతం వాటా విక్రయం!

Tuesday 16th July 2019

కొనుగోలుకు ముందుకొచ్చిన కంపెనీలు డీల్‌ విలువ సుమారు రూ.6,000 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తున్న జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చినట్టు సమాచారం. ఇందుకోసం అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) కన్సార్షియంతో కెనడాకు చెందిన పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ (పీఎస్‌పీ ఇన్వెస్ట్‌మెంట్స్‌) చేతులు కలుపుతోంది. కన్సార్షియంలో ఈ

Most from this category