STOCKS

News


ఇండియన్‌ బ్యాంక్‌పై రూ.కోటి జరిమానా

Wednesday 12th December 2018
news_main1544591672.png-22846

ముంబై: ‘మోసాలు - వర్గీకరణ, నివేదిక’కు సంబంధించి వాణిజ్య బ్యాంకులు పాటించవలసిన ఆదేశాలను ఇండియన్‌ బ్యాంక్‌ పాటించలేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. ఇందులో భాగంగా సైబర్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.కోటి జరిమానా విధించింది. నవంబర్‌ 30, 2018న బ్యాంకుకు ఇచ్చినటువంటి ఉత్తర్వు ద్వారా ఈ మేరకు పెనాల్టీ విధించినట్లు వెల్లడించింది. ఆర్‌బీఐ జారీచేసిన మార్గదర్శకాలు, ఆదేశాలను పాటించనందుకు.. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Wednesday 12th December 2018

 ఆసియా ట్రేడింగ్‌లో బుధవారం ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్ప పెరుగుదలతో 1,249.30డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపుపై సందిగ్ధత, డాలర్‌ ఇండెక్స్‌ పతనం కారణాలతో ఈ వారం ప్రారంభం నుంచి పసిడి 5నెలల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో యూఎస్‌ బాండ్‌ ఈల్డ్ పెరిగింది. బ్రిటన్‌లో బ్రిగ్జిట్‌ అంశంతో నెలకొన్న రాజకీయ

నియామకాల్లో మహిళలకు రెడ్‌ కార్పెట్‌

Wednesday 12th December 2018

ముంబై:  వచ్చే ఏడాది మహిళా ఉద్యోగుల నియామకాలు గణనీయంగా పెరగనున్నాయి. 2019లో మహిళల హైరింగ్ 15-20 శాతం మేర పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ .. ఫైనాన్షియల్ సర్వీసెస్‌ .. ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్ఐ), ఆటోమోటివ్‌, ఐటీ, సాఫ్ట్‌వేర్‌, హాస్పిటాలిటీ.. ట్రావెల్ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నట్లు 'ది ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ 2019' పేరిట రూపొందించిన నివేదికలో పీపుల్‌స్ట్రాంగ్‌ తెలియజేసింది. సుమారు 15 రంగాలకు చెందిన

Most from this category