News


పబ్లిక్‌ క్రెడిట్‌ రిజిస్ట్రీ కోసం ఆరు ఐటీ కంపెనీలఎంపిక

Monday 24th December 2018
news_main1545625073.png-23185

న్యూఢిల్లీ: డిజిటల్‌ పౌర క్రెడిట్‌ రిజిస్ట్రీ (పీసీఆర్‌/పౌరుల రుణాల సమాచార కేంద్రం) ఏర్పాటుకు గాను ఆర్‌బీఐ ఆరు అగ్ర స్థాయి ఐటీ కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. వీటిల్లో టీసీఎస్‌, విప్రో, ఐబీఎం ఇండియా, క్యాప్‌ జెమిని, డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌, మైండ్‌ట్రీ ఉన్నాయి. ఈ ప్రతిపాదిత పీసీఆర్‌లో సెబీ, కార్పొరేట్‌ వ్యహారాల శాఖ, జీఎస్టీ నెట్‌వర్క్‌, ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ల తరఫు నుంచి సమాచారం సైతం ఉటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ గ్రహీతలకు సంబంధించి 360 డిగ్రీల కోణంలో అన్ని రకాల వ్యవస్థల నుంచి సమాచారాన్ని పొందే అవకాశం కల్పించడమే  పీసీఆర్‌ ఏర్పాటు లక్ష్యం. 



You may be interested

నిఫ్టీ 50ని మించి రాబడి

Monday 24th December 2018

 యాక్సిస్‌ బ్లూచిప్‌ ఫండ్‌ మార్కెట్లు పెరిగినప్పుడు లాభాలు పొందడం సులభమే. దాదాపు అన్ని స్టాక్స్‌ చెప్పుకోతగ్గ రాబడులను ఇస్తుంటాయి. దీంతో అసలు ఏ తరహా స్టాక్స్‌లో లాభాలు వస్తాయనే ఫండమెంటల్స్‌ను ఇన్వెస్టర్లు పట్టించుకోరు. కానీ, మార్కెట్లు కరెక్షన్‌లోకి వెళ్లినప్పుడు అప్పటి వరకు ఉన్న లాభాలను కాపాడుకోవడంతోపాటు నష్టాలను పరిమితం చేసుకోవాలంటే, అందు కోసం నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి సారించాల్సి ఉంటుంది. మార్కెట్లలో ప్రతికూల సమయాల్లోనూ అధిక వృద్ధికి అవకాశాలు ఉండి, తక్కువ

రూపీ డౌన్‌..

Monday 24th December 2018

ఇండియన్‌ రూపాయి సోమవారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే స్వల్పంగా నష్టపోయింది. ఆసియా ప్రధాన కరెన్సీలు మిశ్రమంగా ట్రేడవుతుండటం ఇందుకు కారణం. ఉదయం 9:10 సమయంలో రూపాయి 70.21 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ముగింపు స్థాయి 70.18తో పోలిస్తే 0.03 శాతం నష్టపోయింది.  భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.292 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు స్థాయి 7.277 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, ధరలు పరస్పరం వ్యతిరేక

Most from this category