STOCKS

News


చిన్న పరిశ్రమల వృద్ధిపై ఆర్‌బీఐ దృష్టి

Thursday 3rd January 2019
Markets_main1546493292.png-23382

సిన్హా నేతృత్వంలో నిపుణలు కమిటీ
వచ్చేవారం ఈ రంగం ప్రతినిధులతో
ఆర్‌బీఐ గవర్నర్‌ భేటీ

ముంబై: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధిపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  మరింత దృష్టి సారిస్తోంది. ఈ రంగం అభివృద్ధిపై సలహాలకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఈ రంగం ప్రతినిధులతో వచ్చేవారం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సమావేశం కానున్నారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో కూడా తాను వచ్చేవారం సమావేశం కానున్నట్లు శక్తికాంత్‌ దాస్‌ ట్వీట్‌ చేశారు. మరిన్ని వివరాల్లోకి వెళితే...
ఎంఎస్‌ఎంఈ రంగానికి సంబంధించి ఆర్థిక, ద్రవ్య స్థిరత్వానికి దీర్ఘకాలిక సూచనలు చేయడానికి ఆర్‌బీఐ బుధవారం ఒక అత్యున్నత  స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ మాజీ చైర్మన్‌ యూకే సిన్హా నేతృత్వం వహిస్తారు. లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తగిన సమయంలో​ తగిన రుణాలు అందుతున్నాయా? రుణ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీ పరిశీలిస్తుందని ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. 2019 జూన్‌ నాటికి కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని ఆర్‌బీఐ ప్రకటన పేర్కొంది. చిన్న పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయంగా పలు దేశాలు తీసుకుంటున్న చర్యలను సైతం ఈ కమిటీ పరిశీలించి, భారత్‌లో ఈ రంగం వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తుంది. ఈ రంగం వృద్ధిలో సాంకేతికత తోడ్పాటుపై కూడా కమిటీ దృష్టి పెడుతుంది. భారత్‌ ఆర్థిక వ్యవస్థలో చిన్న పరిశ్రమల కీలక ప్రాధాన్యత నేపథ్యంలో తాజా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన చేసింది. దేశం మొత్తం ఎగుమతుల్లో ఎంఎస్‌ఎంఈ వాటా 40 శాతంకాగా, తయారీ రంగంలో ఈ విభాగం వాటా 45 శాతం.
- ఆర్‌బీఐ మంగళవారం చిన్న పరిశ్రమలకు భారీ ఊరటనిచ్చే కీలక నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలోనే ఈ రంగానికి సంబంధించి తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం ఆర్‌బీఐ చేసిన ప్రకటన ప్రకారం-  రూ. 25 కోట్ల వరకూ రుణం ఉండి, చెల్లించలేకపోతున్న రుణాన్ని, ఒకేసారి పునర్‌వ్యవస్థీకరించడానికి ఆర్‌బీఐ అనుమతించింది. అయితే సంస్థ రుణం పునర్‌వ్యవస్థీకరించే నాటికి, ఆ సంస్థ జీఎస్‌టీలో నమోదై ఉండాలి. అయితే జీఎస్‌టీ నమోదు అవసరం లేదని మినహాయింపు పొందిన ఎంఎస్‌ఎంఈలకు ఇది వర్తించదు.
- ఎన్‌బీఎఫ్‌సీ ప్రతినిధులతో దాస్‌ సమావేశం మరో ముఖ్య విశేషం.  దేశంలోని అతిపెద్ద ఎన్‌బీఎఫ్‌సీ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో పలు ఎన్‌బీఎఫ్‌సీలు, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు తీవ్ర లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబర్‌ 12న బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండుసార్లు ప్రభుత్వ బ్యాంకర్లతో, ఒకసారి ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశమయ్యారు. లిక్విడిటీ, చిన్న పరిశ్రమలకు రుణ లభ్యతసహా దిద్దుబాటు చర్యల పరిధిలో (పీసీఏ) ఉన్న 11 బ్యాంకులపై  ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి.

రుణ పునర్‌వ్యవస్థీకరణ స్కీమ్‌పై ఎంఎస్‌ఎంఈ డిమాండ్‌
ఇదిలావుండగా, ఆర్‌బీఐ రుణ పునర్‌వ్యవస్థీకరణ పథకాన్ని వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కింద ఇంకా రిజిస్టర్‌ కాని కంపెనీలకూ వర్తింపజేయాలని ఎంఎస్‌ఎంఈ డిమాండ్‌ చేసింది. సంబంధిత సంస్థల రుణాలనూ ప్రాధాన్యతా రంగానికి ఇస్తున్న రుణాలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేసింది.


RBI

You may be interested

పార్లమెంట్‌ ముందుకు ఆధార్‌ సవరణ బిల్లు

Thursday 3rd January 2019

న్యూఢిల్లీ: బయోమెట్రిక్ ఐడీ ఆధార్ చట్ట సవరణ బిల్లును కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్లు మొదలైనవి పొందడానికి వినియోగదారులు గుర్తింపు ధృవీకరణ పత్రం కింద ఆధార్‌ను స్వచ్ఛందంగా మాత్రమే ఇచ్చేలా ఇందులో ప్రతిపాదనలున్నాయి. ఆధార్ ఇవ్వడానికి ఇష్టపడని వారికి బ్యాంకు ఖాతా, సిమ్ కార్డులు మొదలైన సర్వీసులు అందించకుండా

ఎస్‌బీఐ లైఫ్‌ - సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు

Thursday 3rd January 2019

రెండింటి మధ్య బ్యాంక్‌ అష్యూరెన్స్‌ ఒప్పందం బెంగళూరు: సిండికేట్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ల మధ్య బ్యాంకష్యూరెన్స్‌ ఒప్పందం కుదిరింది. ఖాతాదారులకు సమగ్రమైన ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ సొల్యూషన్‌ను అందించడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఒప్పందంపై సిండికేట్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ మృత్యుంజయ్‌ మహాపాత్ర, ఎస్‌బీఐ లైఫ్‌  సీఈఓ, ఎమ్‌డీ సంజీవ్‌ నౌతియాల్‌ సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా 3,000 బ్రాంచ్‌లతో సేవలందిస్తున్న సిండికేట్‌ బ్యాంక్‌ తన బ్రాంచ్‌ల

Most from this category