STOCKS

News


బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నష్టాల​‘‘సెటాఫ్‌’’కు ఆర్‌బీఐ నో

Tuesday 18th September 2018
Markets_main1537250120.png-20348

న్యూఢిల్లీ: షేర్ ప్రీమియం ఖాతాల్లోని నిధులతో నష్టాలను సెటాఫ్ చేసుకునేందుకు అనుమతించాలంటూ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర చేసిన అభ్యర్ధనను రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. సెప్టెంబర్ 11న ఆర్‌బీఐ ఈ మేరకు లేఖ పంపినట్లు స్టాక్ ఎక్స్చేంజీలకు సోమవారం బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తెలియజేసింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నష్టాలు సుమారు రూ.2,543 కోట్ల పైగా పేరుకుపోయాయి. సంస్థ వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించేందుకు.. షేర్‌ ప్రీమియం ఖాతాలో నుంచి తగు మొత్తాన్ని ఈ నష్టాలకు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాలని ఆర్‌బీఐని బ్యాంకు కోరింది. పబ్లిక్ ఇష్యూలో జారీ అయిన షేర్లకు మించి షేర్‌హోల్డర్లు చెల్లించిన అదనపు మొత్తం అంతా షేర్ ప్రీమియం అకౌంటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యాంకు వద్ద ఇలాంటి నిధులు రూ.5,294 కోట్ల మేర ఉన్నాయి. సోమవారం బీఎస్‌ఈలో బ్యాంకు షేరు 1.04 శాతం లాభంతో రూ. 12.66 వద్ద ముగిసింది.


RBI

You may be interested

మరో ఏడాది పాటు అధిక కేటాయింపులే

Tuesday 18th September 2018

బ్యాంకింగ్ రంగం మొండిబాకీలపై ఇండియా రేటింగ్స్ నివేదిక ముంబై: 2019-20 ఆర్థిక సంవత్సరం దాకా మొండిబాకీలకు బ్యాంకులు అధిక కేటాయింపులు కొనసాగించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్‌ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు 3 శాతం దాకా ప్రొవిజనింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది అర్ధ సంవత్సర అంచనాల నివేదికలో ఇండియా రేటింగ్స్ వివరించింది. దీర్ఘకాలికంగా పేరుకుపోయిన మొండిబాకీలు, 2016 ఆర్థిక సంవత్సరంలో

హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు పైపైకి

Tuesday 18th September 2018

2013తో పోలిస్తే 26 శాతం పెరుగుదల కన్సల్టింగ్‌ సంస్థ అనరాక్‌ నివేదిక వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భాగ్యనగరిలో ఇళ్ల ధరలు పైపైకి వెళ్తున్నాయి. 2013తో పోలిస్తే 26 శాతం ధర అధికమైందని ప్రాపర్టీ కన్సల్టింగ్‌ కంపెనీ అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది. గతంలో ఇన్వెస్టర్లలో సెంటిమెంటు బలహీనంగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగినప్పటికీ ధరల్లో పెరుగుదల ఉందని తెలియజేసింది. ‘జనాభాతోపాటు ఐటీ, ఐటీ సర్వీసుల కంపెనీలకు హైదరాబాద్‌ కేంద్రం. నివాసయోగ్యం

Most from this category