STOCKS

News


రాణా కపూర్‌కు ఆర్‌బీఐ నో

Thursday 18th October 2018
news_main1539833928.png-21253

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్ ఎండీ, సీఈవో రాణా కపూర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ నిరాకరించింది. కొత్త చీఫ్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా నియమించాలని బ్యాంకు బోర్డును ఆదేశించింది. స్టాక్ ఎక్స్చేంజీలకు యస్‌ బ్యాంక్ బుధవారం ఈ విషయాలు తెలియజేసింది. "యస్ బ్యాంక్ ఎండీ, సీఈవోగా రాణా కపూర్ వారసుణ్ని 2019 ఫిబ్రవరి 1లోగా ఎంపిక చేయాలని రిజర్వ్ బ్యాంక్ పునరుద్ఘాటించింది" అని వివరించింది. దాదాపు రూ.10,000 కోట్ల మేర మొండిబాకీలను పద్దుల్లో సరిగ్గా చూపలేదని ఆడిట్‌లో తేలిన నేపథ్యంలో మరో విడత సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించేందుకు రిజర్వ్ బ్యాంక్ నిరాకరించిన సంగతి తెలిసిందే. 
మూడేళ్ల పదవీకాలాన్ని 2019 జనవరి 31 దాకా ఆర్‌బీఐ కుదించింది. అప్పటికల్లా కొత్త సీఈవోను నియమించాలంటూ ఆదేశించింది. దీంతో కొత్త సీఈవో అన్వేషణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన బ్యా్ంక్.. కపూర్ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలంటూ రిజర్వ్ బ్యాంక్‌ను కోరింది. ఈ ప్రతిపాదననే ఆర్‌బీఐ తాజాగా తోసిపుచ్చింది. 2004లో యస్ బ్యాంక్‌ ప్రారంభమైనప్పట్నుంచీ రాణా కపూర్ ఎండీ, సీఈవోగా కొనసాగుతున్నారు. ఆయనకు బ్యాంక్‌లో 10.66 శాతం వాటాలు ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో యస్ బ్యాంక్ షేరు 6.85 శాతం క్షీణించి రూ. 231.75 వద్ద క్లోజయ్యింది. 



You may be interested

భారత్‌లో ‘వీఎంవేర్‌’ భారీ పెట్టుబడులు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ వీఎంవేర్‌ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్లు (రూ.14,679 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే ప్రాంతాలలోని కార్యాలయాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనుండగా, ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ సీఈఓ పాట్ జెల్సింగర్ అన్నారు. ‘భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 5,000 మంది

రూపాయి పతనంతో నష్టాలే... నష్టాలు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: డాలర్‌ మారకంలో రూపాయి విలువ పతనం- ఎగుమతిదారులకు ప్రయోజనకరమన్న వాదన ఉంది. దిగుమతులు తగ్గుతాయన్న విశ్లేషణలూ ఉన్నాయి. అయితే వాస్తవంలో ఇలా జరగాలేదని బ్యాంకింగ్‌ దిగ్గజం- స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అధ్యయనం ఒకటి విశ్లేషించింది. వివరంగా చూస్తే... ♦ ఎగుమతుల కోణంలో...: ఎగుమతిదారులు తమ ఎగుమతుల విలువను డాలర్లలో సంపాదించుకుంటారు. ఈ డాలర్లను దేశంలో మార్చుకుంటే, ఎక్కువ రూపాయలు వారి చేతికి అందుతాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత

Most from this category