STOCKS

News


యస్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ వార్నింగ్‌

Saturday 16th February 2019
news_main1550309529.png-24222

రహస్యంగా ఉంచాల్సిన నివేదికలో కొంత భాగాన్ని బహిర్గతం చేయడం పట్ల యస్‌బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌ఏఆర్‌(రిస్క్‌ అసెస్‌మెంట్‌ రిపోర్ట్‌)లో అంశాలను అందరికీ తెలియజేయడమనేది కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యగా అభివర్ణించింది. ఇందుకుగాను యస్‌బ్యాంక్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆర్‌బీఐ వార్నింగ్‌ లెటర్‌ పంపినట్లు యస్‌బ్యాంక్‌ తాజాగా స్టాక్‌ఎక్చేంజ్‌లకు వెల్లడించింది. బ్యాంకు పనితీరులో ఇంకా అనేక లొసుగులు, నియంత్రణా ఉల్లంఘనలు ఉన్నాయని ఆర్‌ఏఆర్‌ గుర్తించినట్లు తెలిపింది. అయితే ఇలాంటి విషయాలను దాచి కేవలం కేటాయింపుల్లో ఎలాంటి అవకతవకలు లేవన్న అంశాన్ని మాత్రమే బయటపెట్టడంపై ఆర్‌బీఐ అసహనంగా ఉంది. కేటాయింపుల్లో అవకతవకలు లేకపోవడమేమీ గొప్ప విషయం కాదని, అది కేవలం కార్పొరేట్‌, అసెట్‌క్లాసిఫికేషన్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవడమేనని తెలిపింది. అలాంటిది కేవలం ఆర్‌ఏఆర్‌లో ఒక విభాగాన్ని మాత్రమే బహిర్గతం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆర్‌బీఐ తన వార్నింగ్‌ లెటర్‌లో పేర్కొంది. ఇది యస్‌బ్యాంక్‌ తప్పిదంగానే భావిస్తామని, ఈ విషయమై మరిన్ని క్రమశిక్షణా చర్యలు ఉండొచ్చని తెలిపింది. ఆర్‌ఏఆర్‌లో యస్‌బ్యాంక్‌కు క్లీన్‌చిట్‌ లభించినట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించడంతో గురువారం బ్యాంకు షేరు ఒక్కమారుగా 30 శాతం దూసుకుపోయింది. 



You may be interested

2-వారాల గరిష్టానికి పసిడి

Saturday 16th February 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం 2వారాల గరిష్టం వద్ద స్థిరపడింది. అమెరికాలో మార్కెట్‌లో 8.20డాలర్ల లాభపడి 1,322.10 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లలలో నెలకొన్న అస్థిరత కారణంగా ఈ ఏడాది అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనే అంచనాలతో డాలర్‌ ఇండెక్స్‌ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోంటుంది. అలాగే మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి అవసరమైన నిధుల బిల్లుకు కాంగ్రెస్‌ అనుమతులు నిరాకరిచడంతో అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ జాతీయ అత్యవవసర(నేషనల్‌

అన్ని రంగాలదీ అదే బాట!

Saturday 16th February 2019

ఒకదాని వెంట ఒకటిగా పతనమవుతున్న షేర్లు దేశీయ మార్కెట్లు ఈ ఏడాది సుదీర్ఘ నష్టాల వారాన్ని నమోదు చేస్తున్నాయి. వరుసగా ఏడు రోజులుగా సూచీలు పతనమవుతున్నాయి. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అనే తేడా లేకుండా ఒకదాని వెంట ఒకటిగా అన్ని స్టాకులు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల విశ్వాసం రోజురోజుకీ దెబ్బతింటూ వస్తోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ బాగానే ఉన్నా, ప్రభుత్వం బడ్జెట్లో వినిమయ ప్రోత్సాహక చర్యలు

Most from this category