STOCKS

News


పెనాల్టీలకు బ్యాంక్‌ల లోపాలే కారణం: స్విఫ్ట్‌

Friday 8th March 2019
news_main1552025948.png-24491

ముంబై: బ్యాంకుల ఆటోమేటెడ్ చెల్లింపు విధానాల్లో లోపాల కారణంగానే వాటిపై రిజర్వ్ బ్యాంక్ జరిమానాలు విధించిందని, తమ వ్యవస్థ వైఫల్యం కాదని స్విఫ్ట్‌ సీఈవో (ఆసియా పసిఫిక్, ఈఎంఈఏ విభాగం) అలెయిన్ రేస్ చెప్పారు. తాము అన్ని బ్యాంకులను పర్యవేక్షించలేమని చెప్పారాయన. అంతర్జాతీయంగా చెల్లింపులకు బ్యాంకులు ఉపయోగించే స్విఫ్ట్ మెసేజింగ్‌ విధానాన్ని సక్రమంగా అమలు చేయనందుకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 19 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ.40 కోట్ల మేర జరిమానా విధించిన సంగతి తెలిసిందే. స్విఫ్ట్‌ను ఉపయోగిస్తున్న బ్యాంకుల విధానాల్లో లోపాలేమైనా గమనిస్తే వాటిని తాము నియంత్రణ సంస్థకు తెలియజేయడానికి మాత్రమే పరిమితమవుతామని, ఆయా సంస్థలపై చర్యలకు సంబంధించి నియంత్రణ సంస్థే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రేస్ పేర్కొన్నారు. స్విఫ్ట్ విధానం అమలు ఖర్చుతో కూడుకున్నదైనప్పటికీ.. మోసాల వల్ల వాటిల్లే నష్టంతో పోలిస్తే తక్కువే ఉంటుందన్నారు. స్విఫ్ట్ విధానం దుర్వినియోగం చేయడం ద్వారా పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ను (పీఎన్‌బీ) వజ్రాభరణ వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ ఏకంగా రూ. 13,000 కోట్ల మేర మోసం చేసిన నేపథ్యంలో ఇతర బ్యాంకులపై ఆర్‌బీఐ జరిమానాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 



You may be interested

హోండా సివిక్‌లో కొత్త వేరియంట్‌

Friday 8th March 2019

ధర రూ.17.7 - 22.3 లక్షల మధ్య న్యూఢిల్లీ: హోండా కార్స్‌ ఇండియా సివిక్‌ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది. సివిక్‌ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లలలో అందుబాటులోకి తెచ్చింది. పెట్రోల్‌ వెర్షన్‌లో 1.8 లీటర్‌ సీవీటీ (ఆటోమేటిక్‌) ట్రాన్సిమిషన్‌, డీజిల్‌ వెర్షన్‌లో 1.6 లీటర్‌ మాన్యువల్‌ సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్సిమిషన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గకు నకానిషి  చెప్పారు.

ఆరేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు

Friday 8th March 2019

ప్రభుత్వ సంస్కరణల ఫలితమే: సీఐఐ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి సంస్కరణల కారణంగా మరో ఆరేళ్లలో పది కోట్లకు పైగా  ఉద్యోగాలు వస్తాయని సిఐఐ అంచనా వేస్తోంది. నైపుణ్య స్థాయిలు పెరుగుతున్నాయని, స్టార్టప్‌ల, కొత్త వ్యాపారాల  జోరు పెరుగుతోందని సీఐఐ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. ఉద్యోగాల నాణ్యత పెరగడమే కాకుండా, ఆదాయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానాలు, చిన్న వ్యాపార సంస్థలకు పన్ను రేటును 25

Most from this category