STOCKS

News


కేంద్రానికి ఆర్‌బీఐ రూ.50వేల కోట్ల డివిడెండ్‌

Thursday 30th August 2018
news_main1535606229.png-19785

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన తన ఆర్థిక సంవత్సరంలో (2017-18) కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించింది. ఈ మొత్తం బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. అలాగే కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) కూడా ఈ మొత్తం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై-జూన్‌ కాలాన్ని తన ఆర్థిక సంవత్సరంగా ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరం కేంద్రానికి ఇచ్చిన డివిడెండ్‌తో పోలిస్తే  (రూ.30,659 కోట్లు) ప్రస్తుత చెల్లించింది దాదాపు 63.08 శాతం అధికం. అయితే 2016-17లో ఈ మొత్తం రూ.65,876 కోట్లు.  ఆర్‌బీఐ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి డివిడెండ్‌ లేదా మిగులుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.54,817.25 కోట్లు సమకూర్చుకోవాలని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించింది. గత ఆర్థిక సంవత్సరం ఈ పద్దు కింద కేంద్రం రూ.51,623.24 కోట్లు సమీకరించింది.



You may be interested

సెప్టెంబర్‌ 1 నుంచి పోస్టల్‌ బ్యాంకు సేవలు

Thursday 30th August 2018

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) సేవలు సెప్టెంబర్‌ 1న ఆరంభం కాబోతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. ‘‘ప్రారంభమైన రోజు నుంచే దేశవ్యాప్తంగా 650 శాఖలు, 3,250 సేవల పాయింట్లు అందుబాటులోకి వస్తాయి’’ అని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్‌సిన్హా బుధవారం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. డిసెంబర్‌ నాటికి మొత్తం 1.55 లక్షల పోస్టాఫీసులను ఐపీపీబీతో అనుసంధానించడం పూర్తవుతుందని,

ఓలెక్ట్రా నుంచి లగ్జరీ ఎలక్ట్రిక్‌ బస్‌

Thursday 30th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లగ్జరీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ-బజ్‌ కే6 శ్రేణిలో భారత్‌లో తొలిసారిగా మినీ ఎలక్ట్రిక్‌ లగ్జరీ బస్‌ను ప్రవేశపెట్టింది. డ్రైవర్‌సహా 12 మంది ప్రయాణించవచ్చు. ప్రీమియం రిక్లైనర్‌ లెదర్‌ సీట్లను పొందుపరిచారు. 7 మీటర్ల పొడవుతో బస్‌ను రూపొందించారు. ముందు, వెనుక ఏబీఎస్‌తో కూడిన డిస్క్‌ బ్రేక్స్‌, సీసీటీవీ నిఘా, విద్యుత్‌, పిడుగుల నుంచి ప్రత్యేక

Most from this category