STOCKS

News


ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో?

Monday 18th March 2019
news_main1552893410.png-24666

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్‌బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్‌ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్‌బీఐతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్‌ ఎక్సేంజ్‌ల అనుమతి కూడా అవసరం అవుతుంది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలు ప్రక్రియను జనవరిలో ఎల్‌ఐసీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. దీంతో 60 ఏళ్లకు పైగా బీమా రంగంలో ఉన్న ఎల్‌ఐసీ ఎట్టకేలకు బ్యాంకింగ్‌ రంగంలోకి అడుగుపెట్టినట్టు అయింది. 



You may be interested

తగ్గిన పసిడి ధర

Monday 18th March 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 5డాలర్ల మేర నష్టపోయింది. అమెరికా ఫెడ్‌రిజర్వ్‌ బ్యాంక్‌ సమీక్షా సమావేశాలు ఈవారంలో మంగళ, బుధ వారాల్లో జరగున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగనం కారణంగా ఈసారి ఫెడ్‌ కీలక వడ్డీరేట్లను యథాతధంగా ఉంచవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. వడ్డీరేట్ల పెంపు లేకపోతే బాండ్‌, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ కొనసాగుతుంది. నేడు ఆసియాలో పలు

పరిశ్రమ వర్గాలతో 26న ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Monday 18th March 2019

న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి

Most from this category