STOCKS

News


ఆర్‌బీఐ పాలసీ సమావేశం ప్రారంభం​

Wednesday 6th February 2019
news_main1549427526.png-24037

  • గురువారం వడ్డీరేట్లపై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మూడు రోజుల ద్రవ్య పరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గురువారంనాడు కీలక నిర్ణయాలను వెలువరించనుంది. 2018-19 ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఇది. గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలో మొట్టమొదటిసారి సమావేశమవుతున్న ఆరుగురు సభ్యుల పరపతి విధాన మండలి ఈ దఫా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.5 శాతం) మార్చకపోవచ్చని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో ఉన్నందున, పాలసీకి సంబంధించి తన పూర్వ ‘జాగరూకతతో కూడిన కఠిన’ వైఖరిని ‘తటస్థం’ దిశగా సడలించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. గత డిసెంబర్‌ పరపతి విధాన సమీక్ష సందర్భంగా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించన ఆర్‌బీఐ, ద్రవ్యోల్బణం ఇబ్బందులు తొలిగితే, రేటు తగ్గింపు చర్యలు ఉంటాయని సూచించింది. దేశ పారిశ్రామిక రంగం మందగమన స్థితిలో ఉండడం వల్ల రేటు విషయంలో ఆర్‌బీఐ కొంత సరళతర వైఖరి ప్రదర్శించవచ్చన్న అభిప్రాయం ఉంది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండుసార్లు ఆర్‌బీఐ రేట్లు పెరిగాయి.

రేటు తగ్గింపు వెసులుబాటు...
కాగా ఆర్‌బీఐకి రేటు తగ్గింపు వెసులుబాటు ప్రస్తుతం ఉందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌ అభిప్రాయపడింది. తగ్గిన క్రూడ్‌ ధరలు, ద్రవ్యోల్బణానికి సానుకూలత అంశాలు తన విశ్లేషణకు కారణమని తాజా నివేదికలో పేర్కొంది.You may be interested

సుబాక్సోన్ కేసులో డాక్టర్‌ రె​డ్డీస్‌కు ఊరట

Wednesday 6th February 2019

హైదరాబాద్‌: జనరిక్‌ ఔషధం సబాక్సాన్‌ కేసులో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌కు అమెరికా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌లో ఊరట లభించింది. వివరాల్లో వెళితే... మాదకద్రవ్య (ఒపియమ్‌) వ్యసనానికి బానిసలయ్యే వారి చికిత్సలో వినియోగించే తమ ఉత్పత్తి సబాక్సాన్‌ జనరిక్‌ వెర్షన్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌సహా ఔషధ కంపెనీలు అమెరికా మార్కెట్‌లో  విక్రయించకుండా నిరోధించాలని బ్రిటిష్‌ ఔషధ ఉత్పత్తి సంస్థ ఇన్డీవర్‌ న్యాయపోరాటం చేస్తోంది. ఈ విషయంలో గత ఏడాది జూన్‌లో ఈ ఔషధానికి

రూ. 899కే విమాన ప్రయాణం..

Wednesday 6th February 2019

ఈ నెల 9 దాకా స్పైస్‌జెట్‌ మెగా సేల్‌ న్యూఢిల్లీ: దేశీయంగా స్వల్ప దూరాల ‍ప్రయాణాలకు సంబంధించి ఎంపిక చేసిన రూట్లలో రూ. 899కే టికెట్ (అన్నీ కలిపి) సేల్ ప్రకటించింది. నాలుగు రోజుల పాటు ఈ మెగా సేల్ ఉంటుందని వెల్లడించింది. ఈ ఆఫర్ కింద గంట పైగా ఉండే ప్రయాణాలకు వన్‌ వే చార్జీలు అతి తక్కువగా కిలోమీటరుకు రూ. 1.75 స్థాయిలో ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది.

Most from this category