STOCKS

News


పరిశ్రమ వర్గాలతో 26న ఆర్‌బీఐ గవర్నర్ భేటీ

Monday 18th March 2019
news_main1552893185.png-24665

న్యూఢిల్లీ: వచ్చే నెల పరపతి విధాన సమీక్ష జరపనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్‌ త్వరలో పరిశ్రమవర్గాలతో భేటీ కానున్నారు. ఈ నెల 26న వాణిజ్య సంఘాలు, రేటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమవుతారని, ఇందులో వడ్డీ రేట్లు, ఆర్థిక వృద్ధికి దోహదపడేందుకు తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆలిండియా బ్యాంక్ డిపాజిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కూడా దీనికి హాజరుకావాలని ఆహ్వానించినట్లు వివరించాయి. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కావడానికి సరిగ్గా వారం రోజులు ముందు.. ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక విధానాన్ని ప్రకటించనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇదే ఎంపీసీ తొలి సమావేశం కూడా కావడంతో ఈ పరపతి విధాన సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఎకానమీపై అభిప్రాయాలను, ఆర్‌బీఐపై అంచనాల గురించి తెలుసుకునేందుకు శక్తికాంత దాస్ ఇప్పటికే బ్యాంకర్లు, ప్రభుత్వ వర్గాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మొదలైన వాటితో సమావేశమవుతూనే ఉన్నారు. 
    గతేడాది డిసెంబర్‌లో 25వ గవర్నర్‌గా దాస్ పగ్గాలు చేపట్టాక.. ఆర్‌బీఐ దాదాపు 18 నెలల విరామం తర్వాత ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 4 శాతం లక్ష్యానికన్నా ఇంకా దిగువనే ఉన్న నేపథ్యంలో వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాలంటూ పరిశ్రమ వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తదుపరి పాలసీ సమీక్షకు ముందు... అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకునే దిశగా సమావేశాలు జరుపుతున్నారు.You may be interested

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో?

Monday 18th March 2019

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకు పేరు మార్చేందుకు ఆర్‌బీఐ సుముఖంగా లేదని సమాచారం. బ్యాంకు పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకుగాను లేదంటే ఎల్‌ఐసీ బ్యాంకుగాను మార్చాలని, ప్రథమ ప్రాధాన్యం ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంకేనని గత నెలలో ప్రతిపాదనలు పంపిన విషయం గమనార్హం. అయితే, ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ అనుకూలంగా లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేరు మార్పునకు ఆర్‌బీఐతోపాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ, వాటాదారులు, స్టాక్‌ ఎక్సేంజ్‌ల అనుమతి

ఆర్‌కామ్‌కు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీకి బీఎస్‌ఎన్‌ఎల్‌

Monday 18th March 2019

రూ.700 కోట్ల బకాయిల వసూలు కోసమే న్యూఢిల్లీ: రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) నుంచి రూ.700 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ వారంలోనే జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ను ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆశ్రయించనుంది. ఇప్పటికే ఎరిక్సన్‌ కేసులో ఈ నెల 19వ తేదీ నాటికి రూ.453 కోట్లను ఆర్‌కామ్‌ ప్రమోటర్‌ అనిల్‌ అంబానీ కట్టాల్సి ఉంది. లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది. దీంతో బ్యాంకు ఖాతాలోని రూ.260

Most from this category