STOCKS

News


ఎఫ్‌పీఐల ఆకర్షణకు వీఆర్‌ఆర్‌ మార్గం

Saturday 6th October 2018
news_main1538802285.png-20912

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) ఆకర్షించేందుకు స్వచ్చంద ఉపసంహరణ మార్గాన్ని (వాలంటరీ రిటెన్షర్‌ రూట్‌/వీఆర్‌ఆర్‌) ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ విధానంలో విదేశీ ఇన్వెస్టర్లకు మరింత వెసులుబాటు ఉంటుందని తెలిపింది. డెట్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు సంబంధించి ఇటీవలి ‍కాలంలో పలు చర్యలు తీసుకున్నట్టు పేర్కొంది. ‘‘దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేలా ఎఫ్‌పీఐలను ప్రోత్సహించేందుకు వీఆర్‌ఆర్‌ అనే పత్ర్యేక మార్గాన్ని ప్రతిపాదించాం. ఈ మార్గంలో ఇనుస్ట్రుమెంట్ల ఎంపిక పరంగా ఎఫ్‌పీఐలకు మరింత వెసులుబాటు ఉంటుంది. స్వల్పకాలిక పెట్టుబడుల పరంగా నియంత్రణపరమైన మినహాయింపులు కూడా ఉంటాయి’’ అని ఆర్‌బీఐ తెలిపింది. ఈ వీఆర్‌ఆర్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు అర్హతగా... పెట్టుబడుల్లో కనీస శాతాన్ని, నిర్ణీత కాలం వరకు భారత్‌లో కొనసాగించేందుకు వారు ఎంచుకోవచ్చని ఆర్‌బీఐ వివరించింది. 



You may be interested

మెర్సిడెస్‌ బెంజ్‌ నుంచి ‘ఏఎంజీ జీ 63’

Saturday 6th October 2018

న్యూఢిల్లీ: జర్మకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ శుక్రవారం దేశీ మార్కెట్‌లో సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీని (స్పోర్ట్‌ యుటిలిటీ వెహికల్‌) విడుదల చేసింది. ‘ఏఎంజీ జీ 63’ పేరుతో విడుదలైన ఈ వాహనం కేవలం 4.5 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 220 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ప్రకటించింది. 4-లీటర్‌ వీ8 బైటర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ ఎస్‌యూవీ ధర రూ.2.19 కోట్లుగా నిర్ణయించింది. ‘స్పోర్ట్స్‌

హెక్సాగాన్‌ ఇండియా విస్తరణ

Saturday 6th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ సొల్యూషన్స్‌ కంపెనీ హెక్సాగాన్‌ కెపాబిలిటీ సెంటర్‌ ఇండియాను (హెచ్‌సీసీఐ) విస్తరించింది. హైదరాబాద్‌లోని ఈ సెంటర్‌కు తాజాగా 300 సీట్ల సామర్థ్యాన్ని జోడించింది. దీంతో సిబ్బంది సంఖ్య 1,250కి చేరింది. మరో 300ల మంది ఉద్యోగులు కూర్చునేలా మరింత స్పేస్‌ను కైవసం చేసుకుంటామని హెక్సాగాన్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ప్రమోద్‌ కౌశిక్‌ తెలిపారు. కస్టమర్‌ ఈవెంట్‌ సందర్భంగా  శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పుణేలో 250 మంది నిపుణులతో

Most from this category