STOCKS

News


ఆర్‌బీఐ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు వాయిదా

Tuesday 4th September 2018
news_main1536037690.png-19939

కోల్‌కతా: ఆర్‌బీఐ ఉద్యోగులు మూకుమ్మడిగా ఈ నెల 4, 5వ తేదీల్లో తలపెట్టిన సెలవుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఆర్‌బీఐ ఉన్నత యాజమాన్యంతో పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం మూకుమ్మడి సెలవు కార్యక్రమాన్ని 2019 జనవరి మొదటి వారానికి వాయిదా వేసినట్టు రిజర్వ్‌ బ్యాంకు అధికారులు, ఉద్యోగుల ఐక్య సంఘం (యూఎఫ్‌ఆర్‌బీఓఈ) తెలిపింది. కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ పరిధిలోని వారు పెన్షన్‌ పథకంలోకి మారే అవకాశం కల్పించాలన్నది ఉద్యోగుల డిమాండ్‌.



You may be interested

ఎన్‌సీసీ చేతికి రూ.3,592 కోట్ల ఆర్డర్లు

Tuesday 4th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ, ఇంజనీరింగ్‌ కంపెనీ నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌కు (ఎన్‌సీసీ) ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీల నుంచి రూ.3,592 కోట్ల విలువ చేసే నాలుగు ఆర్డర్లు దక్కాయి. ఇందులో రూ.671 కోట్ల రెండు బిల్డింగ్‌ డివిజిన్‌ ఆర్డర్లు, రూ.2,850 కోట్ల రోడ్స్‌ డివిజన్‌ ఆర్డర్, రూ.70.9 కోట్ల వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డివిజన్‌ ఆర్డర్‌ ఉన్నాయని కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో

తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలెలా ఇచ్చారు?

Tuesday 4th September 2018

చెన్నై: కార్పొరేట్‌ కంపెనీల రుణ ఎగవేతల విషయంలో బ్యాంకుల ఉదాసీనతపై మద్రాస్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన తనఖాల్లేకుండా కంపెనీలకు వేల కోట్ల రుణాలను ఎలా మంజూరు చేశారంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను నిగ్గదీసింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు చెన్నైకు చెందిన కనిష్క్‌ గోల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాదాపు రూ.820 కోట్ల రుణాలను ఎగవేసిన సంగతి తెలిసిందే. ఈ రుణ ఎగవేత స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌

Most from this category