STOCKS

News


డేటా స్టోరేజ్‌ నిబంధనలను అనుగుణంగా 80% కంపెనీలు

Tuesday 16th October 2018
news_main1539665770.png-21190

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన డేటా లోకలైజేషన్‌ (భారత్‌లోని సమాచారం ఇక్కడే భద్రపర్చడం) నిబంధనలకు అనుగుణంగా ఇప్పటివరకు 80 శాతం కంపెనీలు ఇక్కడే డేటాను భద్రపరుస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ నిబంధనలకు అక్టోబరు 15 (సోమవారం) తుది గడువు కాగా, పలు డెబిట్‌/క్రెడిట్‌ కంపెనీలు మినహాయించి దాదాపు మిగిలిన అన్ని కంపెనీలు భారత్‌లోనే డేటాను భద్రపరుస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఈ సంస్థలు పలు మార్లు గడువుపొడింపును కోరగా.. ఆర్‌బీఐ ఆదిశగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. గడువుతేదీ ముగిసిన నేపథ్యంలో ఇప్పటికీ డేటా లోకలైజేషన్‌ ఏర్పాటుచేయని సంస్థలను  కేస్ టు కేస్ ప్రాతిపదిక ఆర్‌బీఐ విచారించనుందని తెలుస్తోంది. నిబంధనలను పాటించని పలు కంపెనీలపై జరిమానాలు విధించడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అనధికారికంగా వ్యక్తమవుతోంది. పేమెంట్‌ సేవలకు సంబంధించిన విదేశీ సంస్థలతో పాటు వాట్స్అప్, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియా సంస్థలు భారత్‌లోనే తమ సమాచారాన్ని నిర్వహించాలని ఆర్‌బీఐ నిబంధనలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ నిబంధలను పాటిస్తు, భారత్‌లోనే డేటా సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు వాట్స్‌యాప్‌, పేటీఎం, ఫోన్‌పే ఇప్పటికే ప్రకటించాయి.



You may be interested

మళ్లీ ‘జారుడు బల్ల’పై ఎగుమతుల విలువ!

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో మళ్లీ పడిపోయాయి. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఈ విలువ -2.15 శాతం క్షీణించింది. మార్చి (-0.66 శాతం)  తరువాత ఎగుమతులు క్షీణతలోకి జారడం ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగితే, దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) మరింత

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,044 కోట్లు

Tuesday 16th October 2018

ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 21 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.861 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 1,044 కోట్లకు పెరిగిందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,452 కోట్ల నుంచి రూ.4,255 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ గగన్‌ బంగా తెలిపారు. ఈ క్యూ2 చివరి

Most from this category