STOCKS

News


డిఫాల్టర్ల లిస్టు ఎందుకు బైటపెట్టలేదు?

Monday 5th November 2018
news_main1541393581.png-21701

న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగ్గొట్టిన వారి (డిఫాల్టర్లు) బైటపెట్టే విషయంపై సుప్రీం కోర్టు తీర్పును గౌరవించకపోవడం మీద వివరణనివ్వాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు కేంద్రీయ సమాచార కమిషన్ (సీఐసీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పటేల్‌పై గరిష్ట పెనాల్టీ ఎందుకు విధించరాదో వివరించాలని సూచించింది. మొండిబాకీలపై ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ రాసిన లేఖను కూడా బహిర్గతం చేయాలంటూ ప్రధాని కార్యాలయం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్‌నకు సూచించింది. ముందుగా రూ. 1,000 కోట్ల పైగా డిఫాల్ట్‌ అయిన రుణాలతో మొదలుపెట్టి ఆ తర్వాత రూ. 500 కోట్ల దాకా రుణాలకు సంబంధించిన వివరాలను అయిదు రోజుల్లోగా ఆర్‌బీఐ వెల్లడించాల్సి ఉంటుందని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌ మాడభూషి శ్రీధరాచార్యులు పేర్కొన్నారు.



You may be interested

అదానీ చేతికి కేఈసీ బికనీర్‌ ట్రాన్స్‌మిషన్‌

Monday 5th November 2018

న్యూఢిల్లీ: విద్యుత్ రంగ సంస్థ అదానీ ట్రాన్స్‌మిషన్‌ తాజాగా కేఈసీ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌నకు చెందిన సంస్థను కొనుగోలు చేయనుంది. కేఈసీ బికనీర్‌ సికర్ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలో (కేబీఎస్‌టీపీఎల్‌) కేఈసీ ఇంటర్నేషనల్‌కి ఉన్న మొత్తం వాటాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ సుమారు రూ. 227.50 కోట్లుగా ఉండనుంది. కేబీఎస్‌టీపీఎల్‌ ప్రాజెక్టు కింద 344 సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేటీ) మేర ట్రాన్స్‌మిషన్

సెన్సెక్స్‌ కీలక నిరోధం 35,605

Monday 5th November 2018

మన మార్కెట్లో ఏ క్షణంలోనైనా రిలీఫ్‌ ర్యాలీ మొదలయ్యే అవకాశాలు వున్నాయంటూ గత కాలమ్‌లో సూచించిన రీతిలోనే భారీ అప్‌ట్రెండ్‌ జరిగింది. రూపాయి వేగంగా కోలుకోవడం, క్రూడ్‌ ధర భారీగా పతనంకావడం ఈ ర్యాలీకి కారణం అయ్యింది. అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం ముగియవచ్చన్న ఆశాభావం కూడా ఇందుకు సహకరించింది.  అయితే విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు క్రితం వారం సైతం కొనసాగుతూ వచ్చాయి. ఈ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ ఇదేరీతిలో వుంటే,

Most from this category