STOCKS

News


31 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ రద్దు

Saturday 10th November 2018
news_main1541828748.png-21847

ముంబై: దాదాపు 31 నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రిజర్వ్ బ్యాంక్‌ రద్దు చేసింది. వీటిలో 27 సంస్థలు బెంగాల్‌కి చెందినవే కావడం గమనార్హం. ఆర్‌బీఐ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది.  ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో నాలుగు సంస్థలు ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందినవి ఉన్నాయి. మరోవైపు, ఆయా సంస్థల అభ్యర్ధన మేరకు 17 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. రిజిస్ట్రేషన్ రద్దయిన వాటిల్లో ప్రాపికాన్‌ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌,  హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే రాంకీ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మొదలైనవి ఉన్నాయి. 



You may be interested

ఎన్‌హెచ్‌పీసీ షేర్ల బైబ్యాక్‌

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జలవిద్యుదుత్పత్తి కంపెనీ ఎన్‌హెచ్‌పీసీ... షేర్లను బైబ్యాక్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ నెల 14న(వచ్చే బుధవారం) జరిగే బోర్డ్‌ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని ఎన్‌హెచ్‌పీసీ తెలిపింది. అయితే ఎన్ని షేర్లను ఎంత సంఖ్యలో కొనుగోలు చేసేదీ, ఎంత మొత్తానికి కొనుగోలు చేసేది తదితర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి ఎన్‌హెచ్‌పీసీలో కేంద్ర ప్రభుత్వానికి 73.67 శాతం వాటా ఉంది.

'శత్రు' షేర్ల విక్రయం ..

Saturday 10th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాల సాధనకు, ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా శత్రు దేశాల పౌరులకు భారత్‌లోని సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల పైచిలుకు ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానానికి  కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాల

Most from this category