STOCKS

News


ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ షేర్‌హోల్డర్లతో ఆర్‌బీఐ సమావేశం రద్దు

Friday 28th September 2018
news_main1538109352.png-20661

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్‌ అండ్ ఫైనాన్స్‌ సర్వీసెస్ (ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌) షేర్‌హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దయ్యింది. "శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటన్నది ఆర్‌బీఐ తెలుసుకోవాలనుకుంటోంది. భవిష్యత్ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలు ఆర్‌బీఐకి కావాలి" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని వివరించాయి. సెప్టెంబర్ 29న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. కంపెనీలో ఎల్‌ఐసీకి అత్యధికంగా 25.34 శాతం, జపాన్‌కి చెందిన ఒరిక్స్ కార్పొరేషన్‌కి 23.54 శాతం వాటాలు ఉన్నాయి. అబు ధాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (12.56%), హెచ్‌డీఎఫ్‌సీ (9.02%), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.67%), ఎస్‌బీఐ (6.42%) వద్ద మిగతా వాటాలు ఉన్నాయి. దాదాపు రూ. 91,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉన్న ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ తీవ్ర లిక్విడిటీ సంక్షోభం కారణంగా ఆగస్టు 27 నుంచి పలు రుణాలు, వడ్డీలు చెల్లించలేక డిఫాల్ట్ అవుతోంది. కంపెనీ తక్షణ అవసరాల కోసం రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 4,500 కోట్లు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది.

ఆర్‌బీఐ లిక్విడిటీ మాత్రమే సమకూర్చాలి: ఆర్‌ గాంధీ..
ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం మరింతగా విస్తరించకుండా చూడాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ డిప్యుటీ గవర్నర్ ఆర్ గాంధీ చెప్పారు. అయితే, ఈ సమస్యకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండేలా చూడటానికి ప్రాధాన్యమివ్వాలే తప్ప కంపెనీని గట్టెక్కించడం గురించి ఆందోళన చెందరాదని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ సాధనాల ద్వారా వ్యవస్థలో ద్రవ్యలభ్యత ఉండేలా చూస్తామంటూ ఆర్‌బీఐ ప్రకటించడం ఈ దిశగా సరైన చర్యగా గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గాంధీ పేర్కొన్నారు. You may be interested

హెచ్‌పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు

Friday 28th September 2018

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్‌పీసీఎల్‌) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్‌పీసీఎల్‌ రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్‌ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్‌లు,

ఎంఎస్‌ఎంఈలకు ఇన్‌స్టామోజో రుణాలు

Friday 28th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ఇన్‌స్టామోజో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు తక్షణ రుణాలను అందజేసేందుకు మోజో క్యాపిటల్‌ సేవలను ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌స్టామోజో కో-ఫౌండర్‌ ఆకాశ్‌ గెహానీ  గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘24 గంటల్లో కస్టమర్‌ ఎప్పుడు కోరినా క్షణాల్లో లోన్‌ వారి ఖాతాలో చేరుతుంది. వడ్డీ

Most from this category