STOCKS

News


బంధన్‌ బ్యాంకుకు షాక్‌

Saturday 29th September 2018
news_main1538200680.png-20690

ముంబై: లైసెన్స్‌ నిబంధనలు పాటించని కారణంగా... కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న బంధన్‌ బ్యాంకుపై ఆర్‌బీఐ కఠిన చర్యలకు దిగింది. కొత్త శాఖలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించడంతో పాటు, బ్యాంకు సీఈవో చంద్రశేఖర్‌ ఘోష్‌ పారితోషికాన్ని స్తంభింపజేసింది. ‘‘బ్యాంకులో నాన్‌ ఆపరేటివ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ (ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ) వాటాను 40 శాతానికి తీసుకురానందుకు కొత్త శాఖల ఏర్పాటుకు ఇచ్చిన అనుమతిని ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఇకపై ఏ ఒక్క శాఖ ఏర్పాటు చేయాలన్నా ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎండీ, సీఈవో పారితోషికాన్ని మాత్రం తదుపరి నోటీసు జారీ అయ్యే వరకు నిలిపివేయడం జరుగుతుంది’’ అని ఆర్‌బీఐ తమను ఆదేశించినట్లు బంధన్‌ బ్యాంకు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బ్యాంకులో ఎన్‌వోఎఫ్‌హెచ్‌సీ వాటాను 40 శాతానికి తీసుకొచ్చే లైసెన్స్‌ షరతును పాటించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఆర్‌బీఐకి సహకరిస్తామని బ్యాంకు ప్రకటించింది. కోల్‌కతా కేంద్రంగా 2001లో ఏర్పాటైన మైక్రోఫైనాన్స్‌ సంస్థ బంధన్‌కు యూనివర్సల్‌ బ్యాంకు లైసెన్స్‌ను 2014 ఏప్రిల్‌లో ఆర్‌బీఐ మంజూరు చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ బ్యాంకుకు 937 శాఖలున్నాయి. 



You may be interested

4న ఐడీబీఐ బ్యాంక్‌ బోర్డ్‌ భేటీ

Saturday 29th September 2018

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ కీలకమైన బోర్డ్‌ సమావేశం వచ్చే వారం (అక్టోబర్‌ నాలుగు- గురువారం) జరగనుంది. బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపాదికన 51 శాతం వాటా షేర్లను కేటాయించే విషయమై సమావేశంలో చర్చిస్తారని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ లేదా ఓపెన్‌ ఆఫర్‌ మార్గంలో సాధించడానికి ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇటీవలే తమకు రాసిన

బ్యాంకులకు రూ.1,700 కోట్లకు టోపీ

Saturday 29th September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: టెలికం, నెట్‌వర్కింగ్‌, పవర్‌ కన్వర్షన్ పరికరాల తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ వీఎంసీ సిస్టమ్స్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రూ.1,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. పీఎన్‌బీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వీఎంసీతో పాటు, కంపెనీ ప్రమోటర్లు ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి వెంకట రామారావు, బి.వెంకట రమణపై కేసు నమోదు చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర,

Most from this category