STOCKS

News


‘‘యస్‌’’ బాస్‌... రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌..!

Friday 25th January 2019
Markets_main1548395132.png-23793

- ఆమోదం తెలిపిన ఆర్‌బీఐ
- మార్చి 1 నుంచి రాణా కపూర్‌ స్థానంలో పగ్గాలు
- అనిశ్చితి తొలగడంతో జోరుగా పెరిగిన షేరు
- ఈ క్యూ3లో 7 శాతం తగ్గిన నికర లాభం
- ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెగతో పెరిగిన కేటాయింపులు
ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన యస్‌ బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓగా రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ నెల 31తో పదవీ కాలం పూర్తవుతున్న రాణా కపూర్‌ స్థానంలో రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ రానున్నారు. ప్రస్తుతం ఆయన డాషే బ్యాంక్‌ ఇండియా అధిపతిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ నియామాకానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని, మార్చి 1వ తేదీకి ముందే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. ఈ విషయాన్ని ఖరారు చేయడానికి ఈ నెల 29న బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం జరుగుతుందని పేర్కొంది.
28 ఏళ్ల బ్యాంకింగ్‌ అనుభవం...
2012, ఆగస్టు నుంచి రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌  డాషే బ్యాంక్‌ ఇండియా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 28 ఏళ్ల అపారమైన అనుభం ఉంది. యస్‌ బ్యాంక్‌ ప్రమోటర్లలో ఒకరైన రాణా కపూర్‌ను సీఈఓ, ఎమ్‌డీ పదవి నుంచి వైదొలగాలని గత ఏడాది సెప్టెంబర్‌లోనే ఆర్‌బీఐ ఆదేశించింది. కపూర్‌ పదవీ కాలాన్ని మరో మూడేళ్లపాటు పొడిగించాలన్న బోర్డ్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. దీనికి గల కారణాలను ఆర్‌బీఐ వెల్లడించకపోయినప్పటికీ, కపూర్‌ హయాంలో మొండి బకాయిల విషయంలో అవకతవకలు జరిగాయని అందుకే ఆర్‌బీఐ ఆయన పదవీ కాలాన్ని పొడిగించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్‌ ధర మూడింట రెండొంతులకు పైగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్‌ సీఈఓ విషయమై అనిశ్చితి తొలగిపోవడంతో యస్‌ బ్యాంక్‌ షేర్‌ జోరుగా పెరిగింది. బీఎస్‌ఈలో 8 శాతం లాభంతో రూ.214 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 19 శాతం ఎగసి రూ.235ను తాకింది. షేర్‌ ధర జోరు కారణంగా యస్‌బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ ఒకేరోజు రూ.3,839 కోట్లు పెరిగి రూ.49,460 కోట్లకు చేరింది.
నికర వడ్డీ ఆదాయం 41 శాతం అప్‌...
యస్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 7 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,077 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.1,002 కోట్లకు తగ్గిందని యస్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం 7 శాతం ఎగసి రూ.3,557 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్‌ పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం 41 శాతం పెరిగి రూ.2,666 కోట్లకు చేరింది. 42 శాతం వృద్ధితో రుణాలు రూ.2,43,885 కోట్లకు, డిపాజిట్లు 30 శాతం వృద్ధి చెంది రూ.2.22,758 కోట్లకు చేరాయి. గత క్యూ3లో 3.5 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్‌ ఈ క్యూ3లో 3.3 శాతానికి తగ్గిందని వెల్లడించారు.
తగ్గిన రుణ నాణ్యత..
యస్‌ బ్యాంక్‌  రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత క్యూ3లో 1.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 2.1 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు 0.93 శాతం నుంచి 1.18 శాతానికి చేరాయి.
తప్పని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సెగ !
ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఒక మౌలిక రంగ దిగ్గజ గ్రూప్‌ కంపెనీలకు రూ.571 కోట్ల మేర రుణాలిచ్చామని, అందుకని నికర కేటాయింపులు రూ.550 కోట్లకు పెరిగాయని కపూర్‌ పేర్కొన్నారు. ఈ మౌలిక రంగ గ్రూప్‌ పేరును ఆయన వెల్లడించలేదు. అయితే అది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ అని నిపుణులు భావిస్తున్నారు. కాగా క్యూ3 ఫలితాలపై యస్‌ బ్యాంక్‌ ప్రస్తుత సీఈఓ రాణా కపూర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ​కేటాయింపులు పెరిగినప్పటికీ, ఆదాయం, మార్జిన్లు, లాభదాయకత తదితర అంశాల్లో మంచి పురోగతి సాధించామని పేర్కొన్నారు. రిటైల్‌ రుణాల జోరు కొనసాగుతోందని వివరించారు.You may be interested

చందా కొచ్చార్‌పై సీఐబీ కేసు

Friday 25th January 2019

- వీడియోకాన్‌తో క్విడ్‌ ప్రో కో వ్యవహారం... - రుణాలిచ్చి ముడుపులు తీసుకున్నారని ఆరోపణ - ఎఫ్‌ఐఆర్‌లో భర్త దీపక్‌, వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్‌ పేర్లు - వీడియోకాన్‌, న్యూపవర్ కార్యాలయాల్లో సోదాలు - కామత్ సహా పలువురు బ్యాంకర్ల పాత్రపై విచారణకు అవకాశం న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు మంజూరు చేసిన రుణాల వివాదంలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర,

స్థిరంగా పసిడి ధర

Friday 25th January 2019

ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ.., పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో భారత వర్తమాన కాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.35డాలర్లు స్వల్పంగా పెరిగి 1,281.15 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు, కొనసాగుతున్న అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఆందోళనలు పసిడి స్థిరమైన ట్రేడింగ్‌కు దోహదపడుతున్నాయి. అయితే సాంకేతికంగా బలమైన నిరోధం, బలపడుతున్న అమెరికా డాలర్‌ పసిడి ర్యాలీకి

Most from this category