STOCKS

News


యస్‌బ్యాంక్‌ సీఈఓగా రవ్‌నీత్‌ గిల్‌..షేరు 9 శాతం జంప్‌

Thursday 24th January 2019
news_main1548324553.png-23786

ప్రస్తుతం డాయిష్‌బ్యాంక్‌ ఇండియా సీఈఓగా పనిచేస్తున్న రవ్‌నీత్‌ సింగ్‌ గిల్‌ను తమ ఎండీ, సీఈఓగా ఎంచుకున్నట్లు యస్‌బ్యాంక్‌ వెల్లడించింది. వచ్చే మార్చి1న ఆయన యస్‌బ్యాంక్‌ పగ్గాలు చేపడతారు. బ్యాంకింగ్‌ రంగంలో ఆయనకు దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. డాయిష్‌బ్యాంక్‌ సీఈఓగా ఆయన ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 10న ఇద్దరి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసిన బ్యాంకు, ఆ పేర్లను ఆర్‌బీఐకి పంపింది. ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈఓను యస్‌బ్యాంకు ప్రకటించాల్సిఉంది. జనవరి చివరకు ప్రస్తుత సీఈఓ రానాకపూర్‌ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. రానా కపూర్‌ను కొనసాగించేందుకు అనుమతినివ్వాలని యస్‌బ్యాంక్‌ చేసిన అభ్యర్ధనను ఆర్‌బీఐ తోసిపుచ్చింది. దీంతో బ్యాంకు కొత్త సీఈఓను ఎంచుకోవాల్సి వచ్చింది. రవ్‌నీత్‌తో పాటు రజత్‌ మోంగా పేరు  కూడా రేసులో చివరవరకు ఉంది. ఆఖరుకు రవ్‌నీత్‌నే సీఈఓ పదవి వరించింది. మరోవైపు గురువారం బ్యాంకు తన క్యు3 ఫలితాలు ప్రకటించింది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 0.5 శాతం, నికర ఎన్‌పీఏలు 0.3 శాతం మేర పెరిగాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు బ్యాంకు ఇచ్చిన రుణమొత్తం రూ. 2530 కోట్లని తేలింది. 

షేరు జోరు...

యస్‌ బ్యాంక్‌ సీఈఓ నియామకపు వార్త గురువారం ట్రేడింగ్‌ ముగింపు సమయంలో వెలువడగానే ఈ షేరు ఒక్కసారిగా కదంతొక్కింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 14 శాతం ర్యాలీ జరిపి రూ. 225 స్థాయికి చేరినప్పటికీ, చివరి అరగంట లావాదేవీల్ని ఎక్సే‍్ఛంజ్‌లు సగటు చేసిన మీదట 9.2 శాతం లాభంతో రూ. 215 వద్ద యస్‌ బ్యాంక్‌ ముగిసింది. You may be interested

చివర్లో కొనుగోళ్లు...లాభాల ముగింపు

Thursday 24th January 2019

10850ల వద్ద నిఫ్టీ 86పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్‌ చివర అరగంటలో హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో మార్కెట్‌ రెండురోజుల నష్టాలకు స్వస్తి పలికింది. నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 10850 వద్ద, సెన్సెక్స్‌ 86 పాయింట్లు పెరిగి 36,195 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులకు తోడు వివిధ కంపెనీల మూడో త్రైమాసికి ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇంట్రాడేలో సూచీలు స్వల్ప లాభనష్టాల మధ్య ట్రేడ్ అయ్యాయి. అయితే చివరి

నష్టాల బాటలో అటో షేర్లు

Thursday 24th January 2019

మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌లో భాగంగా అటో షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 1శాతనికి పైగా నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా అశోక్‌లేలాండ్‌ 4.50శాతం షేరు నష్టపోయింది. అలాగే టాటామోటర్స్‌ డీవీఆర్‌, టాటామోటర్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. ఎక్సైడ్‌ లిమిటెడ్‌, మదర్‌సుమి లిమిటెడ్‌, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు 2శాతం, టీవీఎస్‌ మోటర్స్‌, ఎంఆర్‌ఎఫ్‌, బజాజ్‌ అటో, అమరరాజాబ్యాటరీస్‌, అపోలో

Most from this category