STOCKS

News


డౌన్‌గ్రేడ్స్‌ పెరుగుతున్నాయ్‌!

Wednesday 10th July 2019
news_main1562741381.png-26947

దేశీయ క్రెడిట్‌ మార్కెట్‌ సవాళ్ల సమయం ఎదుర్కొంటోంది. మార్కెట్లో క్రెడిట్‌ నాణ్యత క్షీణిస్తోందని కేర్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. కేర్‌ రేటింగ్స్‌ మదింపు చేసే ఎంసీఆర్‌(మోడిఫైడ్‌ క్రెడిట్‌ రేషియో) జూన్‌ త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ఠం 0.8కి చేరింది. దీంతో కేర్‌ రేటింగ్స్‌ జరిపే డౌన్‌గ్రేడ్స్‌ వేగం పుంజుకుఉన్నాయి. గతేడాది జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే తాజా త్రైమాసికంలో కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ చేసిన కంపెనీల సంఖ్య 26 శాతం పెరిగింది. ఇదే సమయంలో అప్‌గ్రేడ్స్‌ 13 నుంచి 7 శాతానికి తగ్గాయి. ముఖ్యంగా ఆటో, కెమికల్స్‌, ఎన్‌బీఎఫ్‌సీ, సిమెంట్‌, రియల్టీ రంగాలు క్రెడిట్‌ క్వాలిటీని కృశింపజేస్తున్నాయని కేర్‌ తెలిపింది. కేవలం ఐటీ, విద్యుత్‌ సరఫరా, హెల్త్‌కేర్‌, ఆతిధ్య రంగాలు మాత్రమే గతేడాదితో పోలిస్తే మెరుగైలన ఎంసీఆర్‌ నమోదు చేసినట్లు వివరించింది. 

లిక్విడిటీ పరిస్థితులు సానుకూలంగా ఉండడం, ఆర్థికంగా మెరుగవడంతో ఐటీ రంగంలో అప్‌గ్రేడ్స్‌ జరుగుతున్నాయని కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. మరోవైపు డౌన్‌గ్రేడ్స్‌ చవిచూస్తున్న రంగాలకు ప్రధాన సమస్య లిక్విడిటీ ఒత్తిళ్లని, దీనికితోడు ప్రాఫిట్‌ మార్జిన్లు బలహీనపడడం, రుణభారాలు పెరగడం, కార్యనిర్వహణ క్షీణించడం, ఇతర ఆర్థిక గణాంకాలు నెగిటివ్‌గా మారడం తదితర కారణాలు కూడా డౌన్‌గ్రేడ్స్‌ను ప్రేరేపిస్తున్నాయని కేర్‌ రేటింగ్స్‌ ఈడీ అరుణ్‌ కుమార్‌ వివరించారు. క్రెడిట్‌రేటింగ్స్‌ భారీగా డౌన్‌గ్రేడ్‌ కావడం వల్ల క్రెడిట్‌ నాణ్యత దెబ్బతినడం అన్ని రంగాల్లో కనిపిస్తోందని ముఖ్యంగా రూ.100 కోట్ల కన్నా తక్కువ రెవెన్యూ ఉన్న కంపెనీల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. 
 



You may be interested

ఎఫ్‌పీఐలపై కక్షేమీ లేదు..

Wednesday 10th July 2019

 కావాలంటే కంపెనీ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అధిక పన్నుభారంపై ఆర్థిక శాఖ వివరణ న్యూఢిల్లీ: బడ్జెట్‌లో అత్యంత సంపన్నులకు పన్ను భారం పెంచే ప్రతిపాదనలపై విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో కేంద్రం స్పందించింది. ఇది ప్రత్యేకంగా ఎఫ్‌పీఐలే లక్ష్యంగా చేసిన ప్రతిపాదన కాదని, విదేశీ ఇన్వెస్టర్లు కావాలంటే కార్పొరేట్‌ సంస్థ కింద నమోదు చేయించుకుని, తక్కువ పన్ను రేట్ల ప్రయోజనాలను పొందవచ్చని వివరణనిచ్చింది. "ఎఫ్‌పీఐలపైనే సర్‌చార్జీ పెంచడం

పాన్‌ షాపుకన్నా అధ్వాన్నంగా తయారైంది!!

Wednesday 10th July 2019

ఇండిగోలో తీవ్రస్థాయిలో గవర్నెన్స్ లోపాలు  జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దండి సెబీకి ప్రమోటరు గంగ్వాల్ లేఖ న్యూఢిల్లీ: దేశీ విమానయాన సంస్థ ఇండిగోలో ప్రమోటర్ల మధ్య వివాదాలు మరింతగా ముదిరాయి. కంపెనీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని పరిస్థితులు చక్కదిద్దాలని కోరుతూ కంపెనీ ప్రమోటర్లలో ఒకరైన రాకేష్ గంగ్వాల్ తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి లేఖ రాశారు. ఇండిగోలో గవర్నెన్స్ లోపాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, దానితో పోలిస్తే కనీసం పాన్‌ షాపు నిర్వహణైనా

Most from this category