STOCKS

News


నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను విక్రయించిన రామ్‌కీ

Saturday 1st September 2018
news_main1535779147.png-19852

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన అనుబంధ కంపెనీ అయిన నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేను సింగపూర్‌కు చెందిన క్యూబ్‌ హైవేస్‌కు విక్రయించింది. నార్కట్‌పల్లి- అద్దంకి- మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వేలో (నామ్‌) నూరు శాతం వాటా అమ్మకానికై క్యూబ్‌ హైవేస్‌తో షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నట్టు శుక్రవారం బీఎస్‌ఈకి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ డీల్‌ ద్వారా రామ్‌కీ రూ.140 కోట్లు పొందడంతోపాటు నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరున ఉన్న రుణాలన్నీ క్యూబ్‌కు బదిలీ అవుతాయి. ఈ మొత్తాన్ని కంపెనీకి ఉన్న రుణం తగ్గించుకోవడానికి వినియోగించనున్నట్టు రామ్‌కీ తెలిపింది. నామ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో వాటాల విక్రయంతో రామ్‌కీ ఇన్‌ఫ్రా రుణం రూ.1,529 కోట్ల మేర తగ్గుతుందని వెల్లడించింది. యాజమాన్య మార్పు విషయమై రుణదాతలు, సంస్థల నుంచి అనుమతులు పొందినట్టు తెలిపింది. శుక్రవారం బీఎస్‌ఈలో రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేరు ధర ఒకానొక దశలో రూ.207.60 వరకు వెళ్లింది. ‍క్రితం ముగింపుతో పోలిస్తే 3.29 శాతం అధికమై రూ.204.25 వద్ద స్థిరపడింది. You may be interested

అడ్రాయిట్‌ చేతికి సెల్టిస్‌ టెక్నాలజీస్‌

Saturday 1st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఎంటర్‌ప్రైస్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ అడ్రాయిట్‌ ఇన్ఫోటెక్‌... యూఎస్‌కు చెందిన సీఆర్‌ఎం ప్రొడక్ట్‌ కంపెనీ సెల్టిస్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసింది. అలాగే అనలిటిక్స్‌, ఇండస్ట్రియల్‌ ఐవోటీ సొల్యూషన్స్‌ కంపెనీ ఇన్ఫోడాట్‌ ఇంటర్నేషనల్‌లో 66.67 శాతం వాటాను దక్కించుకుంది. చిన్న, మధ్యతరహా కంపెనీల విభాగంలో సంస్థ స్థానాన్ని మరింత మెరుగు పర్చుకునేందుకు ఈ డీల్స్‌ దోహదం చేస్తాయని అడ్రాయిట్‌ ఇన్ఫోటెక్‌ ఎండీ ఎస్‌.సుధా కిరణ్‌

ఈ ఏడాది రూ.60,000 కోట్ల ప్రీమియం

Saturday 1st September 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.60,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయం సాధించాలని ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ లక్ష్యం విధించుకుంది. ఇందులో కొత్త పాలసీల ప్రీమియం రూ.6,300 కోట్లుగా నిర్దేశించుకుంది. 2017-18లో రూ.50,000 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయాన్ని నమోదు చేసినట్లు సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ టి.సి.సుశీల్‌ కుమార్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కోటి పాలసీలను జారీ చేయాలని

Most from this category