STOCKS

News


225 శాతం పెరిగిన రామ్‌కీ లాభం

Wednesday 14th November 2018
news_main1542173029.png-21975

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మౌలిక రంగ సంస్థ రామ్‌కీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 2018-19 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 225 శాతం పెరిగి రూ.11.7 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.357 కోట్ల నుంచి రూ.364 కోట్లను తాకింది. ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఆరు నెలల కాలంలో రూ.625 కోట్ల టర్నోవరుపై మొత్తం రూ.30 కోట్ల నికరలాభం సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. మంగళవారం బీఎస్‌ఈలో రామ్‌కీ ఇన్‌ఫ్రా షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 2.33 శాతం పెరిగి రూ.127.60 వద్ద స్థిరపడింది.



You may be interested

పెన్నార్‌ లాభం రూ.12 కోట్లు

Wednesday 14th November 2018

సెప్టెంబరు క్వార్టరు కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో పెన్నార్‌ ఇండస్ట్రీస్‌ నికరలాభం క్రితం ఏడాది స్థాయిలోనే రూ.12.6 కోట్లుగా నమోదయింది.  టర్నోవరు రూ.426 కోట్ల నుంచి రూ.528 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో రూ.994 కోట్ల టర్నోవరుపై రూ.27 కోట్ల నికరలాభం ఆర్జించింది. మంగళవారం బీఎస్‌ఈలో పెన్నార్‌ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే 1.18 శాతం తగ్గి రూ.41.80 వద్ద స్థిరపడింది.

32 శాతం తగ్గిన ఎన్‌ఎండీసీ లాభం

Wednesday 14th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: మైనింగ్‌ రంగ దిగ్గజం ఎన్‌ఎండీసీ సెప్టెంబరు త్రైమాసికంలో నిరాశ పరిచింది. స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32.7 శాతం తగ్గి రూ.636 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.2,531 కోట్ల నుంచి రూ.2,569 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌-సెప్టెంబరు పీరియడ్‌లో రూ.5,116 కోట్ల టర్నోవరుపై రూ.1,612 కోట్ల నికరలాభం సాధించింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 0.47 శాతం

Most from this category