News


వచ్చే ఏడాదే బజాజ్‌ ‘ఎలక్ట్రిక్‌’ వాహన ఎంట్రీ

Tuesday 22nd January 2019
news_main1548129928.png-23717

క్వాడ్రిసైకిల్‌ క్యూట్‌, ఆటోలతో ఆరంభం
కేటీఎం హస్క్‌వర్న ఈ ఏడాదే మార్కెట్లోకి
సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ఎప్పుడెపుడా అని ఎదురు చూస్తున్న వేళ... వచ్చే ఏడాదే ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశించనున్నట్టు బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్‌ ప్రకటించారు. బీఎస్‌-6 కాలుష్య విడుదల నిబంధనలకు అనుగుణంగా తమ వాహనాల ఇంజన్లను మార్చడంతోపాటు ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశం కూడా వచ్చే ఏడాది ఉంటుందన్నారు. ‘‘ఎలక్ట్రిక్‌ క్యూట్‌, ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలు (ఆటోలు) తమ అజెండాలో ముందున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా మా పెట్రోల్‌, డీజిల్‌ ఇంజన్లను రూపొందించనున్నాం’’ అని రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. కేటీఎంకు చెందిన హస్క్‌వర్న మోటారు సైకిల్‌ బ్రాండ్‌ను భారత మార్కెట్లోకి ఈ ఏడాదే తీసుకురానున్నట్టు రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లోకి ప్రవేశించాల్సిన ప్రాధన్యాన్ని వివరిస్తూ... ‘‘భారత్‌ కోసమే కాదు, మాకు సంబంధించి చాలా ఇతర మార్కెట్ల అవసరాల కోసం ఇది చేయాల్సి ఉంది. కాలుష్య సమస్య, రద్దీ కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు, షేర్డ్‌, కనెక్టడ్‌ మొబిలిటీ అవసరం కలుగుతోంది’’ అని రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. బజాజ్‌ ఆటో తన నాలుగు చక్రాల క్యూట్‌ (క్వాడ్రిసైకిల్‌)ను ఇప్పటికే 20 దేశాలకు ఎగుమతి చేస్తున్న విషయం గమనార్హం.
మార్చిలో దేశీయ రోడ్లపైకి క్యూట్‌
భారత్‌లో క్యూట్‌ను ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న ప్రశ్నకు... మార్చిలో జరగొచ్చని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. తుది అనుమతుల ప్రక్రియలో ఉందన్నారు. ‘‘20కు పైగా విదేశీ మార్కెట్లలో బజాజ్‌ ఆటో లీడర్‌గా ఉంది. బంగ్లాదేశ్‌లో 70 శాతం, నేపాల్‌, శ్రీలంకలో 50 శాతం వరకు వాటా ఉంది. భారత్‌లో కూడా ఇదే జరుగుతుంది. మోటారు సైకిల్‌ విభాగంలో ఇప్పటి వరకు చూపించిన ప్రదర్శన కంటే మరింతగా రాణించాలనుకుంటున్నాం. దేశ మార్కెట్లో కేవలం 20-21 శాతం వాటాయే ఉంది. విదేశీ మార్కెట్లో విజయం సాధించినట్టు, దేశీయంగా మూడు చక్రాల వాహనాల్లో రాణించినట్టుగానే... మోటారుసైకిళ్లలోనూ ఇదే పనితీరు చూపించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని ఆయన పేర్కొన్నారు. దేశీయ మోటారు సైకిళ్ల విభాగంలో గత 9 నెలల్లోనే 6-7 శాతం మార్కెట్‌ వాటాను పెంచుకున్నట్టు సియామ్‌ గణాంకాలను గుర్తు చేశారు.
‘ది వరల్డ్‌ ఫేవరెట్‌ ఇండియన్‌’ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ సంస్థ బజాజ్‌ ఆటో లిమిటెడ్‌ 17 ఏళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో సాధించిన పురోగతిపై ‘ద వరల్డ్‌ ఫేవరెట్‌ ఇండియన్‌’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. సంస్థ ఎండీ రాజీవ్‌ బజాజ్‌ సోమవారం ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ద్విచక్రవాహన ఎగుమతుల్లో బజాజ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, సంస్థ ఆదాయంలో 40 శాతం విదేశీ మార్కెట్ల నుంచే వస్తున్నట్టు చెప్పారు. 70 దేశాల్లో 15 మిలియన్ల వాహనాల అమ్మకాలతో కేంద్ర ప్రభుత్వ ఆకాంక్ష అయిన ‘మేకిన్‌ ఇండియా’కు చిరునామాగా బజాజ్‌ నిలిచిందని రాజీవ్‌ వివరించారు. గత పదేళ్లలో సంస్థ 13 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీతిఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ పాల్గొన్నారు.You may be interested

మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎక్స్‌4’ పేరుతో నూతన మోడల్‌ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక పెట్రోల్‌, రెండు డీజిల్‌ వేరియంట్లలో ఈ మోడల్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌ వేరియంట్‌ కారు ధర రూ.63.5 లక్షలు.. డీజిల్‌ వేరియంట్ల ధరల శ్రేణి రూ.60.6 లక్షలు – రూ.65.9 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. చెన్నై ప్లాంట్‌లో వీటి ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలియజేసింది. ఈ

నెరవేరిన ఎల్‌ఐసీ స్వప్నం

Tuesday 22nd January 2019

- నెరవేరిన ఎల్‌ఐసీ స్వప్నం - పూర్తిగా చేతికొచ్చిన ఐడీబీఐ బ్యాంకు - 51 శాతం వాటా కొనుగోలు పూర్తి - మెజారిటీ వాటాదారుగా అవతరణ న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించాలన్న ఎల్‌ఐసీ చిరకాల స్వప్నం నెరవేరింది. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం నియంత్రిత వాటా కొనుగోలును ఎల్‌ఐసీ పూర్తి చేసినట్టు బ్యాంకు ప్రకటించింది. ‘‘ఐడీబీఐ బ్యాంకు, ఎల్‌ఐసీకి ఇది పరస్పర విజయం వంటిది. వాటాదారులు, కస్టమర్లు, ఉద్యోగులకు ఎంతో విలువను సమకూర్చిపెడుతుంది’’ అని ఐడీబీఐ

Most from this category