STOCKS

News


గూగుల్‌కు రాజన్‌ ఆనందన్‌ గుడ్‌బై

Wednesday 3rd April 2019
news_main1554275396.png-24946

న్యూఢిల్లీ: గూగుల్‌ ఇండియాకు సౌత్ ఈస్ట్ ఆసియా అధ్యక్షుడుగా సేవలందిస్తున్న రాజన్ ఆనందన్ ఈ సంస్థకు రాజీనామా చేశారు. ఈయన స్థానంలో గూగుల్ ప్రస్తుత సేల్స్‌ కంట్రీ డైరెక్టర్‌ వికాస్ అగ్నిహోత్రి తాత్కాలిక బాధ్యతలు చేపడతారని గూగుల్‌ ప్రకటించింది. ఈనెల చివరి వరకు ఆనందన్ సంస్థకు సేవలందిస్తారని వెల్లడించింది. వెబ్‌ఎంగేజ్, ఇన్‌స్టామోజో, కాపిల్లరీ టెక్నాలజీస్, ట్రావెల్‌ఖానా, ఈజీగోవ్ వంటి పలు అంకుర సంస్థల్లో పెట్టుబడిదారుగా ఉన్న ఆనందన్ గూగుల్‌ను వీడి.. అమెరికాకు చెందిన వెంచర్ కాపిటల్ సంస్థ సీక్వోయా కాపిటల్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. 2010లో గూగుల్‌లో చేరిన ఆయన అంతకుముందు మైక్రోసాఫ్ట్ ఇండియా, డెల్ ఇండియాల్లో సేవలందించారు.



You may be interested

Wednesday 3rd April 2019

7 బిలియన్ డాలర్లకు క్లౌడ్ మార్కెట్‌ - 2022 నాటికి దేశీ మార్కెట్‌పై అంచనా - నాస్కామ్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: బిగ్‌ డేటా, అనలిటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మొదలైన వాటికి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా క్లౌడ్ మార్కెట్‌ 2022 నాటికల్లా మూడు రెట్లు వృద్ధి చెందనుంది. 7.1 బిలియన్ డాలర్లకు చేరనుంది. 'క్లౌడ్-నెక్ట్స్ వేవ్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఇండియా' పేరిట విడుదల చేసిన నివేదికలో సాఫ్ట్‌వేర్

కంపెనీల ‘రుణ భారం’ దించిన సుప్రీం!

Wednesday 3rd April 2019

కంపెనీల ‘రుణ భారం’ దించిన సుప్రీం! - ఆర్‌బీఐ 'ఫిబ్రవరి 12' సర్క్యులర్‌ను తోసిపుచ్చిన  అత్యున్నత న్యాయస్థానం - సంస్థలన్నింటినీ ఒకేగాటన కట్టడం కదరదని స్పష్టీకరణ - వేర్వేరు పరిశీలనలతో ఎన్‌సీఎల్‌టీకి రిఫర్‌ చేయవచ్చని సూచన న్యూఢిల్లీ: మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీచేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ పరిణామం మొండిబకాయిలుగా మారిన రుణాల భారంతో సతమతమవుతున్న విద్యుత్‌

Most from this category