STOCKS

News


రాఫెల్‌ కాంట్రాక్టు రక్షణ శాఖ ఇవ్వలేదు

Monday 13th August 2018
news_main1534136626.png-19204

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల సరఫరా కాంట్రాక్టు విషయంలో అనిల్‌ అంబానీ గ్రూపు పాత్రపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో... దీనిపై అనిల్‌ అంబానీ గ్రూపు వివరణ ఇచ్చింది. రక్షణ శాఖ నుంచి ఎటువంటి కాంట్రాక్టు తమకు రాలేదని, ఇది తప్పు అని, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలుగా పేర్కొంది. 36 యుద్ధ విమానాలను సరఫరా చేయాల్సిన ఫ్రెంచ్‌ సంస్థ దసాల్ట్‌ గ్రూపు, ఒప్పందం మేరకు విమానాల సరఫరాకు రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ను భాగస్వామిగా ఎంచుకున్నదని, భారతీయ భాగస్వాముల ఎంపికలో రక్షణ శాఖకు ఎటువంటి పాత్ర లేదని వివరించింది. ఈ మేరకు రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ సీఈవో రాజేష్‌ దింగ్రా మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ కాంట్రాక్టు విషయమై మోదీ సర్కారుపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై విచారణకు జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. యూపీఏ హయాం కంటే అధిక ధరలకు కాంట్రాక్టు కుదుర్చుకున్నారని, ఎటువంటి అనుభవం లేని రిలయన్స్‌ సంస్థకు కాంట్రాక్టు దక్కిందంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న నేపథ్యంలో రిలయన్స్‌ గ్రూపు వివరణ ఇవ్వడం గమనార్హం. ఇది ప్రభుత్వం, ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. 36 విమానాలను ‘ఫ్లై అవే’ షరతు మేరకు అందించాల్సి ఉంటుంది. అంటే ఫ్రాన్స్‌ నుంచి ఎగుమతి చేయాల్సి ఉంటుంది. హెచ్‌ఏఎల్‌ లేదా మరే సంస్థ కూడా తయారు చేయకూడదు. డిఫెన్స్‌ కొనుగోళ్ల ప్రక్రియ (డీపీపీ) ప్రకారం విదేశీ సంస్థలు భారతీయ భాగస్వాముల ఎంపికలో రక్షణ శాఖ పాత్ర ఉండదు. 2005 నుంచి అన్ని ఆఫ్‌సెట్‌ (ఎగుమతి) కాంట్రాక్టులకు ఇదే అమలవుతోంది. ఇప్పటి వరకు 50 ఆఫ్‌సెట్‌ ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడేమీ కొత్త విధానం అనుసరించలేదు. అ అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం ఇది’’ అని రాజేష్‌ దింగ్రా తెలిపారు.
దసాల్ట్‌ ద్వారా...
యుద్ధ విమానాల తయారీలో రిలయన్స్‌కు అనుభవ లేమిపై ప్రశ్నకు దింగ్రా బదులిస్తూ... హెచ్‌ఏఎల్‌ మినహా ఏ భారతీయ కంపెనీకి ఈ విషయంలో అనుభవం లేదని స్పష్టం చేశారు. ఆఫ్‌సెట్‌ కార్యక్రమంలో భాగంగా దసాల్ట్‌ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ (డీఆర్‌ఏఎల్‌) ద్వారా రిలయన్స్‌ పాల్గొంటుంది. ఇందులో దసాల్ట్‌ వాటా 49 శాతం.  రాఫెల్‌ ఒప్పందం ప్రకటనకు కొన్ని రోజుల ముందే రిలయన్స్‌ డిఫెన్స్‌ ఏర్పాటు కావడంపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ... మూడు కంపెనీలను 2014 డిసెంబర్‌లో ఏర్పాటు చేయగా, రక్షణ రంగంలోకి రిలయన్స్‌ ప్రవేశంపై 2015 ఫిబ్రవరిలో జరిగిన ఏరో ఇండియా సదస్సులో ప్రకటన చేసినట్టు చెప్పారు. రిలయన్స్‌కు రూ.30,000 కోట్లు కాకుండా నిజానికి రూ.1.3 లక్షల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయన్న ప్రశ్నకు... రూ.30,000 కోట్లన్నవి అంచనాలేనని, రూ.లక్ష కోట్లు 50 సంవత్సరాల లైఫ్‌సైకిల్‌ ఖర్చులకు సంబంధించినదన్నారు. తనకు తెలిసి దసాల్ట్‌ గ్రూపుతో ప్రభుత్వం ఎటువంటి లైఫ్‌ సైకిల్‌ కాంట్రాక్టు కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు.  



You may be interested

మరింత మెరుగుపడనున్న ఆర్థిక వృద్ధి

Monday 13th August 2018

న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌తో పాటు పెట్టుబడులూ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో భారత ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని పరిశ్రమలపై నిర్వహించిన సీఐఐ-ఆస్కాన్ సర్వేలో వెల్లడైంది. మెరుగైన వర్షపాతం, ఒక మోస్తరు ద్రవ్యోల్బణం, పండుగల సీజన్ మొదలైన సానుకూల అంశాలతో వినియోగం పెరుగుతుందని.. డిమాండ్‌, పెట్టుబడుల రికవరీకి ఇది తోడ్పడనుందని సర్వే నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 70

ఐవోసీ లాభం 50 శాతం అప్‌

Monday 13th August 2018

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థ ఐవోసీ జూన్‌ త్రైమాసికంలో 50 శాతం అధికంగా లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.6,831 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,549 కోట్లుగా ఉంది. ఇన్వెంటరీ లాభాలు (దిగుమతి చేసుకున్న ముడి చమురు, విక్రయానికి వచ్చే సరికి రేట్ల పెరుగుదలతో కలిగే ప్రయోజనం) రూ.7,866 కోట్లుగా ఉండడమే ఈ స్థాయి పనితీరుకు దోహదపడింది. రిఫైనరీ మార్జిన్లు

Most from this category