STOCKS

News


అవెన్యూ సూపర్‌మార్ట్‌లో ఒకశాతం వాటా విక్రయించిన దమానీ

Saturday 10th August 2019
news_main1565432280.png-27687

డీ-మార్ట్‌ రిటైల్‌ మాల్స్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్‌ లిమిటెడ్‌ ప్రధాన ప్రమోటర్ల ఒకరైన రాధాకృష్ణ దమానీ 1శాతం వాటాను విక్రయించారు. ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో దమానీ ఆగస్ట్‌ 09న ఓపెన్‌ మార్కెట్‌ పద్ధతిలో 1శాతం వాటాకు సమానమైన మొత్తం 62.3లక్షల ఈక్విటీ షేర్లను ప్రతిషేరు ధర రూ.1,404.10 వద్ద రూ.561.64 కోట్లకు విక్రయించినట్లు బీఎస్‌ఈలో గణాంకాలు తెలియజేశాయి. అయితే, వాటాను కొనుగోలు చేసినవారి పేరు తెలియలేదు. పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ నియమనిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్‌ వాటాను పెంచేందుకు ఈ దమానీ వాటా విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. జూన్‌ త్రైమాసికం చివరి నాటికి అవెన్యూ సూపర్‌మార్ట్‌లో ప్రమోటర్ల మొత్తం వాటా 81.20శాతంగా ఉండగా, అందులో దమానీకి 23కోట్ల ఈక్విటీ షేర్లకు సమానమైన 38.41శాతం వాటా ఉంది. శుక్రవారం మార్కెట్‌ ముగిసేసరికి అవెన్యూ సూపర్‌మార్ట్‌ షేరు 1.50శాతం నష్టంతో రూ.1,452.85 వద్ద స్థిరపడింది. గత నెలలో బడ్జెట్‌ ప్రతిపాదించిన నిబంధన ప్రకారం ప్రతి కంపెనీ తన మొత్తం వాటాలో 25శాతం పబ్లిక్‌ వాటా కలిగి ఉండాలి.



You may be interested

ప్రభుత్వ చర్యలే .. 11,450 స్థాయికి తీసుకెళతాయి!

Saturday 10th August 2019

ప్రభుత్వం తీసుకునే సానుకూల చర్యల వలన మార్కెట్‌ తిరిగి 11,450 స్థాయికి చేరుకోగలదని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఉమేష్ మెహతా ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ప్రభుత్వ చర్యలు..అవసరం ప్రస్తుతం మార్కెట్లను సానుకూలపరిచే అంశాలు  ఏమి లేవు. వాణిజ్య యుద్ధం, బలహీనమైన కరెన్సీ వంటి అంతర్జాతీయ కారకాలు మార్కెట్లను ఊహాగానాలపై నడిపించే అవకాశం ఉంది. ఎఫ్‌పిఐలపై సర్‌చార్జి పన్ను తగ్గుతుందని మార్కెట్లు అంచనా

ఈవారం మార్కెట్‌ను ప్రభావితం చేసిన 10 స్టాకులు

Saturday 10th August 2019

 ప్రభుత్వం మార్కెట్లకు అనుకూలమైన  చర్యలను చేపట్టనుందనే వార్తల నేపథ్యంలో గురువారం, శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా ముగిశాయి. ఫలితంగా గత నాలుగు వారాల పాటు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు ఈ వారం గణనీయంగా పుంజుకున్నాయి. ఆర్థిక శాఖ అధికారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) ఆందోళనలపై చర్చించేందుకు శుక్రవారం వీరిని కలిశారు. అంతేకాకుండా మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ప్రభుత్వం అనేక దశలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడడంతో మార్కెట్లు

Most from this category