STOCKS

News


నగరాల్లో దూసుకెళ్తున్న క్విక్‌ రైడ్‌..

Friday 9th August 2019
news_main1565329031.png-27662

  • యూజర్ల సంఖ్య 20 లక్షలకు చేరిక
  • కంపెనీ కో-ఫౌండర్‌ కేఎన్‌ఎం రావు

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- కార్‌, బైక్‌ పూలింగ్‌ సంస్థ క్విక్‌ రైడ్‌ తొమ్మిది నగరాల్లో 20 లక్షల యూజర్లతో దూసుకెళ్తోంది. ఇందులో ఒక్క హైదరాబాద్‌లోనే కంపెనీకి 3 లక్షల మంది వినియోగదార్లున్నారు. రోజుకు 90,000లకుపైగా కార్‌ పూల్స్‌ నమోదవుతున్నాయి. దీనిని 2020 చివరికల్లా 10 లక్షల స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యమని క్విక్‌ రైడ్‌ కో-ఫౌండర్‌ కేఎన్‌ఎం రావు గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘2015 నుంచి ఇప్పటి వరకు 2.15 కోట్ల కార్‌ పూల్స్‌ పూర్తి చేశాం. నాలుగు లక్షల కార్‌ ఓనర్లు, 3.5 లక్షల బైక్‌ ఓనర్లు నమోదయ్యారు. ఇందులో హైదరాబాద్‌లో 40,000 కార్‌ యజమానులు, 25,000 బైక్‌ యజమానులు రిజిష్టరయ్యారు. వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో భాగ్యనగరి రెండో స్థానంలో ఉంది. ఇక కంపెనీ వినియోగదార్లలో 57 శాతం మంది మహిళలే’ అని వివరించారు. త్వరలో సోడెక్సో ఫ్యూయెల్‌ కార్డ్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు చెప్పారు. రైడ్‌ ట్రాకింగ్‌, ఎమర్జెన్సీ అలర్ట్‌తోపాటు రైడ్‌ ఆఫర్‌ చేసే యజమాని ప్రొఫైల్‌, రేటింగ్‌, చేసిన రైడ్స్‌ సంఖ్య, ఆన్‌ టైమ్‌ ఉంటారా లేదా అన్న వివరాలు యాప్‌లో పొందుపరిచారు.
ఇది ఎలా పనిచేస్తుందంటే..
క్విక్‌ రైడ్‌లో నమోదైన వాహన యజమాని పూలింగ్‌ను ఆఫర్‌ చేస్తారు. తను వెళ్లే దారిలో యూజర్లు ఎవరైనా వాహనంలో వెళ్లొచ్చు. ఇలా వెళ్లినవారిలో క్విక్‌ రైడ్‌లో నమోదైన ఇతర వాహన యజమానులు ఉన్నట్టయితే పూలింగ్‌ను వినియోగించుకున్నందుకు పాయింట్లను షేర్‌ చేస్తారు. వాహనం లేని వారు క్విక్ రైడ్‌ నుంచి పాయింట్లను కొనుక్కొని వాహన యజమానికి షేర్‌ చేయాల్సి ఉంటుంది. రైడ్‌ ఆఫర్‌ చేసే యజమానిని బట్టి ఒక్కో కిలోమీటరుకు 5 పాయింట్ల వరకు చార్జీ ఉంటుంది. వాహనం లేని కస్టమర్‌ ఒక్కో కిలోమీటరుకు 3 పాయింట్లు షేర్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్కో పాయింట్‌ రూపాయితో సమానం. ఈ పాయింట్లను హెచ్‌పీ, షెల్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకుల్లో వెహికిల్‌ ఓనర్లు రిడీమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. పూలింగ్‌ ఆఫర్‌ చేయడం ద్వారా వాహన యజమానులు ప్రయాణ వ్యయం తగ్గించుకోవచ్చు. ఇతరులైతే తక్కువ చార్జీతో గమ్యస్థానాలు చేరుకోవచ్చు. 



You may be interested

ఇన్వెస్టర్లకు రిస్క్‌ ఫండ్‌లపై ఆసక్తి!

Friday 9th August 2019

ధీరేంద్ర కుమార్  మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు, ప్రమాదకర ఫండ్‌లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని వాల్యు రిసెర్చ్‌, వ్యవస్థాపకుడు, సీఈఓ ధీరేంద్ర కుమార్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. ఎంఎఫ్‌ ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకుంటున్నారు.. లిక్విడ్ ఫండ్స్‌తో పాటు, ఈక్విటీ ఫండ్స్ కూడా మంచి స్థితిలోనే ఉన్నాయి. అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్‌) ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోడానికి ఆత్రుతగా ఉన్నారు. ఒకసారి ఫోకస్ ఫండ్లలోకి

సీఎస్ఆర్‌లో విఫలమైతే నేరంగా చూడబోం

Friday 9th August 2019

కార్పొరేట్‌ శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమం కింద ఏదేనీ కంపెనీ నిర్ణీత మేర నిధులను ఖర్చు చేయని సందర్భాల్లో నేరంగా పరిగణించే ఉద్దేశ్యమేదీ లేదని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ స్పష్టం చసింది. సీఎస్‌ఆర్‌ అన్నది ఇకపై ఎంత మాత్రం ఔదార్య చర్యగా కొనసాగదన్నారు. కంపెనీలు తమ వార్షిక లాభాల్లో 2 శాతం మేర (క్రితం మూడు సంవత్సరాల సగటు వార్షిక లాభం) సీఎస్‌ఆర్‌ కోసం ఖర్చు

Most from this category