STOCKS

News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ4 ఫలితాలు

Friday 10th May 2019
news_main1557473812.png-25661

  • పీఎన్‌బీ హౌసింగ్‌ లాభం 51 శాతం అప్‌

-ఒక్కో షేర్‌కు రూ.9 తుది డివిడెండ్‌ 
-రూ.1,000 కోట్లు దాటిన నికర లాభం 

న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) గత ఆర్థిక సంవత్సరం (2018-19) జనవరి-మార్చి క్వార్టర్‌లో 51 శాతం ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.252 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.380 కోట్లకు పెరిగిందని పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,638 కోట్ల నుంచి 31 శాతం వృద్ధితో రూ.2,148 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎమ్‌డీ సంజయ్‌ గుప్తా పేర్కొన్నారు. నికర వడ్డీ ఆదాయం రూ.541 కోట్ల నుంచి 13 శాతం పెరుగుదలతో రూ.610 కోట్లకు చేరిందని వివరించారు. నికర వడ్డీ మార్జిన్‌ 3.59 శాతం నుంచి 3.18 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.9 తుది డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు.  ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.841 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 42 శాతం వృద్ధితో రూ.1,192 కోట్లకు పెరిగిందని సంజయ్‌ గుప్తా తెలిపారు. తమ నికర లాభం రూ.1,000 కోట్ల మైలురాయిని దాటిందని, రుణ నాణ్యత, లాభదాయకత మెరుగుపరచుకోవడంపై దృష్టిసారించనున్నామని వివరించారు. 
తగ్గిన రుణనాణ్యత...
ఈ కంపెనీ రుణ నాణ్యత ఒకింత తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 0.33 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చినాటికి 0.48 శాతానికి పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 0.23 శాతం నుంచి 0.38 శాతానికి చేరాయి. నిర్వహణ ఆస్తులు రూ.62,252 కోట్ల నుంచి శాతం వృద్ధితో రూ.84,722 కోట్లకు ఎగిశాయి. రుణాలు 30 శాతం వృద్ధితో రూ.74,023 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం చాలా సమస్యాత్మక సంవత్సరమని కంపెనీ ఎమ్‌డీ సంజయ్‌ గుప్తా వ్యాఖ్యానించారు. నిధుల లభ్యత సమస్య తీవ్రంగా ఉండి భారత ఆర్థిక, రియల్టీ రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందని పేర్కొన్నారు. అయినప్పటికీ, మంచి వృద్ధిని సాధించామని తెలిపారు. 

  • గ్రాన్యూల్స్‌ లాభం రూ.236 కోట్లు

హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా నికర లాభం 78 శాతం వృద్ధి నమోదైంది.  2017–18 ఆర్థిక సంవత్సరం కన్సాలిడేషన్‌ ఫలితాల్లో రూ.135 కోట్ల పన్ను తర్వాత లాభాన్ని (పీఏటీ) ఆర్జించగా.. 2018–19 నాటికది రూ.236 కోట్ల పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1702 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. ఈ ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధితో రూ.2,306 కోట్లకు చేరింది. ఎబిటా 42 శాతం వృద్ధితో రూ.411 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. రూపాయి ముఖ విలువ గల షేర్‌కు 25 పైసల డివెడెండ్‌ను, 2019 ఆర్థిక సంవత్సరానికి షేర్‌కు 75 పైసలు మధ్యంతర డివెడెండ్‌ను బోర్డ్‌ ప్రకటించింది.

  • ఓల్టాస్‌ లాభం 27 శాతం డౌన్‌

-ఒక్కో షేర్‌కు రూ.4 డివిడెండ్‌
-రూ.2,092 కోట్లకు మొత్తం ఆదాయం
 
న్యూఢిల్లీ:  టాటా గ్రూప్‌నకు చెందిన ఓల్టాస్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం(2018-19) క్యూ4లో 27 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.194 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ4లో రూ.142 కోట్లకు తగ్గిందని ఓల్టాస్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,092 కోట్ల నుంఇచ 1 శాతం వృద్ధితో రూ.2,120 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.1,806 కోట్ల నుంచి 7 శాతం వృద్ధితో రూ.1,935 కోట్లకు పెరిగాయని తెలిపింది. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.4 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వెల్లడించింది. యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్స్‌(యూసీపీ) విభాగం ఆదాయం 6 శాతం తగ్గి రూ.998 కోట్లకు, ఎలక్ట్రోమెకానికల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగం ఆదాయం 12 శాతం పెరిగి రూ.976 కోట్లకు చేరాయని వివరించింది.  పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017-18లో రూ.578 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 11 శాతం తగ్గి రూ.514 కోట్లకు చేరిందని కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.6,602 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.7,310 కోట్లకు పెరిగిందని వివరించింది. 

  • ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుకు తగ్గిన నష్టాలు

క్యూ4లో రూ.1,985 కోట్ల నష్టం ప్రకటన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ఇంకా నష్టాల నుంచి బయటపడలేదు. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.1,985 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,606 కోట్ల నష్టంతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. గత డిసెంబర్‌ త్రైమాసికంలో బ్యాంకు నష్టాలు రూ.346 కోట్లతో పోలిస్తే, క్వార్టర్‌ వారీగా నష్టాలు పెరిగాయి. ప్రస్తుత మొండి బకాయిలకు (ఎన్‌పీఏలు) చేసిన రూ.1,400 కోట్ల కేటాయింపులకుతోడు, ఒక మోసపూరిత ఖాతాకు చేసిన మరో రూ.700 కోట్ల వల్లే నష్టాలు వచ్చినట్టు ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు తెలిపింది. ఇక బ్యాంకు ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.5,814 కోట్ల నుంచి రూ.5,473కోట్లకు తగ్గింది. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు రూ.3,738 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2017-18 సంవత్సరంలో నష్టం రూ.6,299 కోట్లతో పోలిస్తే 40 శాతం వరకు తగ్గింది. ఆదాయం 2017-18లో రూ.21,661 కోట్లుగా ఉంటే, 2018-19లో రూ.21,837 కోట్లకు చేరింది. 
ఎన్‌పీఏలు కాస్త తగ్గుదల
బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు 2019 మార్చి నాటికి 21.97 శాతానికి (రూ.33,398 కోట్లు) తగ్గాయి. 2018 మార్చి నాటికి 25.58 శాతం (రూ.38,180 కోట్లు)గా ఉండడం గమనార్హం. నికర ఎన్‌పీఏలు కూడా 15.33 శాతం (రూ.20,399 కోట్లు) నుంచి 10.81 శాతానికి (13,368 కోట్లు) తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 300 కోట్ల షేర్ల జారీ ద్వారా నిధులు సమీకరించాలనే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌, రైట్స్‌ ఇష్యూ లేదా క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా నిధులు సమీకరించే ఆలోచనతో ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. 

  • 38 శాతం తగ్గిన సౌత్‌ ఇండియా బ్యాంక్‌ లాభం

-ఒక్కో షేర్‌కు 25 పైసలు డివిడెండ్‌
-13 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం 

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018-19)జనవరి-మార్చి క్వార్టర్‌లో 38 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2017-18) క్యూ4లో రూ.114 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.71 కోట్లకు తగ్గిందని సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,768 కోట్ల నుంచి రూ.2,027 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం రూ.1,588 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.1,791 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.149 కోట్ల నుంచి రూ.219 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఇక ఒక్కో ఈక్విటీ షేర్‌కు 25 పైసలు డివిడెండ్‌ను ఇవ్వనున్నామని వెల్లడించింది. 
తగ్గిన రుణ నాణ్యత
బ్యాంక్‌ రుణ నాణ్యత తగ్గింది. గత ఏడాది మార్చి నాటికి 3.59 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ ఏడాది మార్చి నాటికి 4.92 శాతానికి పెరిగాయని బ్యాంక్‌ వెల్లడించింది. అలాగే నికర మొండి బకాయిలు 2.60 శాతం నుంచి 3.45 శాతానికి చేరాయని తెలిపింది. విలువ పరంగా చూస్తే, అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,980 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,132 కోట్లకు పెరిగాయని పేర్కొంది. అలాగే నికర మొండి బకాయిలు రూ.1,416 కోట్ల నుంచి రూ.2,164 కోట్లకు పెరిగాయని వివరించింది. 



You may be interested

ఆర్‌ఐఎల్‌ షేరు కొనొచ్చా?

Friday 10th May 2019

నాలుగు సెషన్లలో 11 శాతం నష్టపోయిన రిలయన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో స్వల్ప శ్రేణిలో కదలాడుతోంది. ఆరంభంలో లాభాల్లో ఉన్న ఆర్ఐఎల్‌ మధ్యాహ్నానికి నష్టాల్లోకి మరలింది. బ్రిటన్‌కు చెందిన బొమ్మల తయారీదారు హామ్‌లేస్‌ను ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ ఆర్‌బ్రాండ్స్‌ సొంతం చేసుకున్నట్లు గురువారం ప్రకటించింది. రూ. 620 కోట్లకు ఈ కొనుగోలు జరిగింది. హామ్‌లేస్‌కు గతంలో ఘన చరిత్ర ఉన్నా ప్రస్తుతం లాభాలు చూపలేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో

పంతం నెరవేర్చుకున్న ట్రంప్‌

Friday 10th May 2019

అమల్లోకి వచ్చిన చైనా దిగుమతులపై టారిఫ్‌లు పెంపు ముందు చెప్పినట్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శుక్రవారం చైనా వస్తూత్పత్తులపై టారిఫ్‌లను పెంచారు. దాదాపు 20వేల కోట్ల డాలర్ల విలువైన చైనా వస్తూత్పత్తులపై టారిఫ్‌ను 25 శాతం మేర పెంచామని, శుక్రవారం నుంచి ఇవి అమల్లోకి వస్తాయని యూఎస్‌ఏ ప్రకటించింది. అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన చైనా, ఇందుకు తగ్గట్లు ప్రతిచర్యలుంటాయని హెచ్చరించింది. దీంతో తాజాగా జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలం అయ్యే

Most from this category