News


కొన్ని ప్రధాన కంపెనీల క్యూ3 ఫలితాలు

Wednesday 23rd January 2019
news_main1548221751.png-23748

ఒబెరాయ్‌ రియాల్టీ లాభం 15 % అప్‌ ఈ ఏడాది క్యూ3లో రూ.137.93 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ఒబెరాయ్‌ రియాల్టీ ప్రకటించింది. అంతక్రితం మూడవ త్రైమాసికంలో సాధించిన రూ.120.19 కోట్లతో పోల్చితే లాభం 15 శాతం పెరిగింది. అంతకుముందు క్యూ3లో కంపెనీ ఆదాయం రూ.360.36 కోట్లు కాగా, ఈసారి రూ.548.79 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

టీవీఎస్‌ మోటార్ లాభం 16 శాతం అప్‌..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో 16 శాతం పెరిగి రూ. 178 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో లాభం రూ.154 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం 26 శాతం వృద్ధి చెంది రూ.3,699 కోట్ల నుంచి రూ.4,664 కోట్లకు పెరిగింది. డిసెంబర్ క్వార్టర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు (ఎగుమతులు సహా) 19 శాతం పెరిగి 7.99 లక్షల నుంచి 9.50 లక్షలకు చేరాయి.

శ్రీ సిమెంట్ మధ్యంతర డివిడెంట్‌:-

న్యూఢిల్లీ: అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో శ్రీ సిమెంట్‌ లాభం సుమారు పది శాతం క్షీణించి రూ. 333 కోట్ల నుంచి రూ. 301 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం దాదాపు 19 శాతం పెరిగి రూ. 2,390 కోట్ల నుంచి రూ. 2,836 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు సుమారు 26 శాతం పెరిగి రూ. 1,964 కోట్ల నుంచి రూ. 2,466 కోట్లకు చేరాయి. సిమెంట్ విభాగం ఆదాయం 16 శాతం వృద్ధితో రూ. 2,559 కోట్లకు, విద్యుత్ విభాగం ఆదాయం 44 శాతం వృద్ధి చెంది రూ. 503 కోట్లకు చేరినట్లు సంస్థ వెల్లడించింది. రూ. 10 ముఖవిలువ గల షేరు ఒక్కింటికి రూ. 25 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొంది.

ఏషియన్ పెయింట్స్‌ లాభం 14 శాతం అప్‌..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏషియన్ పెయింట్స్ నికర లాభం 14 శాతం వృద్ధితో రూ. 647 కోట్లకు చేరగా, ఆదాయం రూ.5,294 కోట్లుగా నమోదైంది. 2017-18 అక్టోబర్‌- డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 567 కోట్లు కాగా ఆదాయం రూ.4,267 కోట్లుగా ఉంది. గతేడాది వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆదాయాలను పోల్చి చూసుకోవడానికి లేదని సంస్థ తెలిపింది.

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నికర లాభం 18 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ నికర లాభం 18 శాతం వృద్ధితో రూ.246 కోట్లకు పెరిగింది. 2017-18 క్యూ3లో ఇది రూ.207 కోట్లు. మరోవైపు ఆదాయం రూ.9,684 కోట్ల నుంచి రూ.9,303 కోట్లకు తగ్గినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వెల్లడించింది. కొత్త చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా నీరజ్ అశ్విన్ షాను నియమించినట్లు, మార్చి 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్‌-డిసెంబర్ మధ్య కాలంలో కొత్త పాలసీలకు సంబంధించిన ప్రీమియం వసూళ్ల అంశంలో 21 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు వివరించింది. 2017-18లో ఇదే వ్యవధిలో మార్కెట్ వాటా 18.4 శాతం.

ఫ్లాట్‌గా ‘హావెల్స్ ఇండియా’ నికర లాభం
ఎలక్ట్రికల్‌ ఉత్పత్తుల సంస్థ అయిన హావెల్స్ ఇండియా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.195.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 0.67 శాతం వృద్ధి చెందింది. 2017-18 క్యూ3లో లాభం రూ.194.36 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.2,551.4 కోట్లు (గతేడాది రూ.1,993.53 కోట్లు) కాగా.. స్విచ్‌గేర్ విభాగం నుంచి రూ.416.2 కోట్లు (రూ.344.3 కోట్లు), కేబుల్‌ డివిజన్‌ ఆదాయం రూ.820.3 కోట్లు (రూ.625.6 కోట్లు), లైటింగ్‌ అండ్‌ ఫిక్చెర్స్‌ నుంచి రూ.369.51 కోట్లు (రూ.287.1 కోట్లు), కన్యూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం లాభం రూ.555.2 కోట్లు (రూ.415.8 కోట్లు)గా ప్రకటించింది.

రిలయన్స్‌ నిప్పన్‌ నికర లాభం 17% డౌన్‌
మూడవ త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.109.52 కోట్లుగా నమోదైందని రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ నిర్వహణ సంస్థ రిలయన్స్ క్యాపిటల్‌కి నిప్పన్ లైఫ్ ప్రకటించింది. గతేడాది ఇదేకాలానికి నమోదైన రూ.132.01 కోట్లతో పోల్చితే 17 శాతం క్షీణత నమోదైంది. కంపెనీ నిర్వహణ ఆదాయం రూ.349.85 కోట్లు కాగా.. గతేడాది క్యూ3 ఆదాయం రూ.398.98 కోట్లుగా తెలిపింది. డిసెంబర్‌ 31, 2018 నాటికి సంస్థ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 7 శాతం వృద్ధి చెంది రూ.4.14 లక్షల కోట్లకు చేరుకుంది.

అలెంబిక్‌ ఫార్మా లాభం 30% అప్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 30 శాతం వృద్ధి చెంది రూ.170 కోట్లకు చేరుకున్నట్లు అలెంబిక్‌ ఫార్మా ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో లాభం రూ.130.6 కోట్లుగా ఉంది. ఆదాయం ఈ త్రైమాసికంలో రూ.1,018.15కోట్లు కాగా, క్రితం క్యూ3లో రూ.840.02 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో అమ్మకాలు పెరిగిన కారణంగా ఆదాయం పెరిగినట్లు కంపెనీ బీఎస్‌ఈకి అందించిన సమాచారంలో తెలిపింది.



You may be interested

వ్యవస్థలోకి రూ.10వేల కోట్లు: ఆర్‌బీఐ

Wednesday 23rd January 2019

ముంబై: వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలు రాకుండా చూస్తామన్న తమ హామీకి అనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు తీసుకుంటోంది. తన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) ద్వారా గురువారం రూ.10,000 కోట్ల బాండ్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విధానం ద్వారా జనవరిలో రూ.50,000 కోట్లను వ్యవస్థలోకి పంప్‌ చేస్తామని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో రూ.30,000 కోట్ల బాండ్‌

2019లో ప్రపంచవృద్ధి 3 శాతమే!

Wednesday 23rd January 2019

 ఐక్యరాజ్యసమితి నివేదిక - ఐఎంఎఫ్‌ 3.5 శాతం అంచనాకన్నా తక్కువ - గుత్తాధిపత్య ధోరణులు నుంచి వాణిజ్య యుద్ధం వరకూ పలు సవాళ్లు ఐక్యరాజ్యసమితి: ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఐక్యరాజ్యసమితి నిరాశాపూరిత నివేదిక విడుదల చేసింది. 2019లో ఈ వృద్ధి రేటు కేవలం 3 శాతంగా పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంచనాలను 3.7 శాతం (అక్టోబర్‌ అంచనా) నుంచి 3.5 శాతానికి తగ్గించింది.   అయితే అంతకన్నా

Most from this category