STOCKS

News


కొన్ని కంపెనీలు త్రైమాసిక ఫలితాల వివరాలు

Tuesday 22nd January 2019
Markets_main1548131431.png-23723

జస్ట్ డయల్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: లోకల్ సెర్చి ఇంజిన్ సంస్థ జస్ట్ డయల్ నికర లాభం అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో రెట్టింపై రూ. 57 కోట్లుగా నమోదైంది. అంతక్రితం క్యూ3లో ఇది రూ. 28.6 కోట్లు. మరోవైపు కంపెనీ ఆదాయం రూ. 199 కోట్ల నుంచి రూ. 261 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో షేరు ఒక్కింటికి రూ. 800 ధరతో 27.5 లక్షల షేర్ల బైబ్యాక్ పూర్తిచేసినట్లు, ఇందుకోసం దాదాపు రూ. 220 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ వివరించింది.

కోరమాండల్‌ మధ్యంతర డివిడెండు రూ.3
ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.3 మధ్యంతర డివిడెండు చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. డిసెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 14.4 శాతం తగ్గి రూ.154 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.2,747 కోట్ల నుంచి రూ.3,059 కోట్లకు ఎగసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు కాలంలో రూ.10,615 కోట్ల టర్నోవరుపై రూ.610 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది.

4 శాతం తగ్గిన హిందుస్తాన్ జింక్ లాభం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వేదాంత గ్రూప్ సంస్థ హిందుస్తాన్ జింక్‌ నికర లాభం 3.7 శాతం క్షీణించి రూ. 2,211 కోట్లకు పరిమితమైంది. అ౾ంతక్రితం ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ. 2,298 కోట్లు. తాజాగా ఆదాయం స్వల్పంగా 1.8 శాతం క్షీణించి రూ. 6,203 కోట్ల నుంచి రూ. 6,090కి తగ్గింది. భూగర్భ గనుల నుంచి ముడిఖనిజాల వెలికితీతను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఉత్పత్తి మరింత మెరుగ్గా ఉండగలదని సంస్థ చైర్మన్ అగ్నివేశ్ అగర్వాల్ చెప్పారు. తలపెట్టిన ప్రాజెక్టుల పనులన్నీ కూడా తుదిదశకు చేరుకున్నాయని, రాబోయే త్రైమాసికాల్లో 1.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యాన్ని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. హిందుస్తాన్ జింక్‌ సంస్థ జింక్‌, సీసం, వెండి ఉత్పత్తి కార్యకలాపాలు సాగిస్తోంది.

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ లాభం 81% జూమ్‌..
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో గ్రూప్‌లో భాగమైన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్స్‌ నికర లాభం 2018-19 డిసెంబర్ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 81 శాతం పెరిగి రూ. 581 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ3లో లాభం రూ. 325 కోట్లు. ఇక మొత్తం ఆదాయం రూ. 2,595 కోట్ల నుంచి రూ. 3,516 కోట్లకు పెరిగింది. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 60,313 కోట్ల నుంచి రూ. 69,080 కోట్లకు చేరింది. 

యూనియన్ బ్యాంక్ లాభం రూ. 153 కోట్లు
ముంబై: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండో త్రైమాసికంలోనూ లాభాలు నమోదు చేసింది. అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో లాభం రూ. 139 కోట్లు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,250 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. తాజాగా ఆదాయం రూ. 9,134 కోట్ల నుంచి రూ. 9,573 కోట్లకు పెరిగింది. అయితే, నికర వడ్డీ ఆదాయం 2.2 శాతం క్షీణించి రూ. 2,493 కోట్లకు తగ్గగా, ఇతర ఆదాయం 25 శాతం పెరిగి రూ. 1,095 కోట్లకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తులు 13.03 శాతం నుంచి 15.66 శాతానికి, నికర ఎన్‌పీఏలు 6.96 శాతం నుంచి 8.27 శాతానికి పెరిగాయి. ప్రొవిజనింగ్‌ ఏకంగా రూ. 1,617 కోట్ల నుంచి రూ. 3,254 కోట్లకు ఎగిసింది. ఈ ఆర్థిక సంవత్సరం 7-9 శాతం మేర రుణ వృద్ధి సాధించే అవకాశం ఉందని బ్యాంక్ గైడెన్స్ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఐఎల్అండ్‌ఎఫ్‌ఎస్‌కి ఇచ్చిన రూ. 1,100 కోట్లలో రూ. 1,000 కోట్లు నిరర్థక ఆస్తుల జాబితాలోకి వర్గీకరించాల్సి వచ్చిందని బ్యాంక్ ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ చెప్పారు.You may be interested

ఆనంద్‌రాఠీ లాంగ్‌టర్మ్‌ రికమండేషన్లు

Tuesday 22nd January 2019

దేశీయ, అంతర్జాతీయ పరిణామాలతో సంబంధం లేకుండా మంచి పనితీరు కనబరుస్తున్న కంపెనీల షేర్లను నమ్ముకోవాలని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం ఆనంద్‌ రాఠీ సూచించింది. దీర్ఘకాలానికి దాదాపు 40 శాతం రాబడినిచ్చే మూడు షేర్లను రికమండ్‌ చేస్తోంది. 1. హావెల్స్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 788. ఎఫ్‌ఎంసీజీ టాప్‌ కంపెనీల్లో ఒకటి. విద్యుదుపకరణాల ఉత్పత్తిలో పేరెన్నికగన్నది. 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వైవిధ్యభరితమైన ఉత్పత్తి పోర్టుఫోలియో ఉంది. గత కొన్ని

ఆవిష్కరణలకు మారుతి సుజుకి ప్రోత్సాహం

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌, రవాణాలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఇండియా ముందుకు వచ్చింది. మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (ఎంఏఐఎల్‌) కార్యక్రమం కింద... భవిష్యత్తు కాలానికి, కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన నవ్యత, కటింగ్‌ ఎడ్జ్‌ సొల్యూషన్లను గుర్తించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆటోమొబైల్‌, రవాణా రంగానికి సంబంధించి తమ ప్రతిభను జాతీయ స్థాయిలో నిరూపించుకునేందుకు తమ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ఎంఏఐఎల్‌ ద్వారా స్టార్టప్‌లు

Most from this category