STOCKS

News


ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌కు వ్యయాల సెగ

Saturday 20th October 2018
news_main1540009797.png-21302

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.376 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.424 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ తెలిపింది. ఇంధన, రవాణా వ్యయాలు పెరగడం. బలహీనమైన నిర్వహణ పనితీరు  వల్ల నికర లాభం తగ్గిందని వివరించింది. మొత్తం ఆదాయం గత క్యూ2లో రూ.7,004 కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.8,372 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.7,815 కోట్లకు చేరాయి. జైప్రకాశ్‌ అసోసియేట్స్‌, జేపీ సిమెంట్‌ ప్లాంట్ల కొనుగోలు, జీఎస్‌టీ అమలు కారణంగా గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ ఫలితాలను, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను పోల్చడానికి లేదని కంపెనీ వివరించింది. 
దేశీయ అమ్మకాలు 21 శాతం అప్‌...
దేశీయ అమ్మకాలు 21 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది.  ఇంధన, లాజిస్టిక్స్‌ వ్యయాలు పెరగడం, రూపాయి పతనం కారణంగా వ్యయాలు 14 శాతం పెరిగాయని వెల్లడించింది. విద్యుత్తు, ఇంధన వ్యయాలు 30 శాతం, లాజిస్టిక్స్‌ వ్యయాలు 25 శాతం, ఇతర వ్యయాలు 20 శాతం చొప్పున పెరిగాయి. ఎబిటా 6.7 శాతం తగ్గి రూ.1,208 కోట్లకు, ఎబిటా మార్జిన్‌ 15.5 శాతానికి తగ్గాయి. అదనపు డైరెక్టర్‌గా కైలాశ్‌ చంద్ర జాన్వర్‌ను నియమించామని ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌ తెలిపింది. ఆయన డిప్యూటీ ఎమ్‌డీ, చీఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫీసర్‌గా, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో బీఎస్‌ఈలో ఈ షేర్‌ నష్టపోయింది. ఇంట్రాడేలో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.3,529ను తాకిన ఈ షేర్‌ చివరకు 3.2 శాతం నష్టంతో రూ.3,609 వద్ద ముగిసింది. You may be interested

పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయాలు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్‌ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది. 2018-19లో తొలి ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం మూడు పీఎస్‌యూల ఐపీవోలు, భారత్‌-22 ఈటీఎఫ్

'ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్' డైరెక్టర్ రాజీనామా

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: రుణాల డిఫాల్ట్‌ల నేపథ్యంలో ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీల్లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వైభవ్ కపూర్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. స్టాక్ ఎక్స్చేంజీలకు ఈ సమాచారం తెలియజేసిన కంపెనీ.. ఆయన రాజీనామాకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ రుణభారం దాదాపు రూ. 90,000 కోట్ల పైగా ఉంది. గ్రూప్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పటికే

Most from this category