STOCKS

News


జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఇంధన సెగ

Tuesday 13th November 2018
news_main1542085924.png-21940

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.1,261 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్‌) వచ్చాయి. ఈ కంపెనీకి నష్టాలు రావడం ఇది వరుసగా మూడో క్వార్టర్‌. ముడి చమురు ధరలు బాగా పెరగడంతో ఇంధన వ్యయాలు 59 శాతం ఎగిశాయి. దీనికి తోడు డాలర్‌తో రూపాయి పతనం కారణంగా విదేశీ మారక ద్రవ్య నష్టాలు ఆరు రెట్లు పెరగడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో రూ.71 కోట్ల నికర లాభం వచ్చిందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. గత క్యూ2లో రూ.1,526 కోట్లుగా ఉన్న ఇంధన వ్యయాలు ఈ క్యూ2లో 59 శాతం ఎగసి రూ.2,420 కోట్లకు పెరిగాయని కంపెనీ సీఈఓ వినయ్‌ దుబే చెప్పారు.  విదేశీ మారక ద్రవ్య నష్టాలు రూ.73 కోట్ల నుంచి ఆరు రెట్లు పెరిగి రూ.417 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతులను అనుసరించనున్నామని, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇక లోడ్‌ ఫ్యాక్టర్‌ 2.5 శాతం పెరిగి 84 శాతానికి చేరిందని తెలిపారు. అనుబంధ ఆదాయం 9 శాతం పెరిగిందని వివరించారు. 

స్డాండ్‌అలోన్‌ పరంగా చూస్తే, ఈ క్యూ2లో రూ.1,297 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వినయ్‌ దుబే చెప్పారు. గత క్యూ2లో రూ.50 కోట్ల నికర లాభం సాధించామని వివరించారు. నిధుల సమీకరణ కోసం వాటాదారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని,  ఆస్తుల విక్రయంపై కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు.  

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్‌ 6 శాతం నష్టంతో రూ.242 వదద​ ముగిసింది. 



You may be interested

నాల్కో లాభం 229 శాతం వృద్ధి

Tuesday 13th November 2018

భువనేశ్వర్‌: అల్యూమినియమ్‌ దిగ్గజం, ప్రభుత్వ రంగ నేషనల్‌ అల్యూమినియమ్‌ కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.510 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.223 కోట్లతో పోలిస్తే 229 శాతం వృద్ధి సాధించామని నాల్కో తెలిపింది. నిర్వహణ లాభం రూ.223 కోట్ల నుంచి 229 శాతం వృద్ధితో రూ.725 కోట్లకు చేరుకుంది. ఇక ఈ ఆర్థిక

కోల్‌ ఇండియా లాభం ఎనిమిది రెట్లు

Tuesday 13th November 2018

న్యూఢిల్లీ: ​కోల్‌ ఇండియా నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో ఎనిమిది రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.370 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.3,085 కోట్లకు పెరిగిందని కోల్‌ ఇండియా తెలిపింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.3,786 కోట్ల నికర లాభం వచ్చిందని, సీక్వెన్షియల్‌గా చూస్తే, 18 శాతం క్షీణత

Most from this category