STOCKS

News


అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం

Tuesday 13th November 2018
news_main1542084607.png-21920

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మధ్యంతర డివిడెండు రూ.1.25 చెల్లించేందుకు బోర్డు సమ్మతించింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో కంపెనీ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21.7 శాతం తగ్గి రూ.611 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు 7 శాతం అధికమై రూ.4,751 కోట్లకు చేరింది. ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో రూ.9,001 కోట్ల టర్నోవరుపై రూ.1,067 కోట్ల లాభం నమోదైంది. ఎబిటా 21.6 శాతంగా ఉంది. ఫార్ములేషన్స్‌ విక్రయాల్లో యూఎస్‌ 6 శాతం, యూరప్‌ మార్కెట్‌ 4 శాతం వృద్ధి చెందాయి. అభివృద్ధికి అవకాశం ఉన్న మార్కెట్లలో ఆదాయం 26 శాతం పెరిగి రూ.307 కోట్లు నమోదు చేసింది. యాంటీ రెట్రోవైరల్‌ సేల్స్‌ 17 శాతం అధికమై రూ.244 కోట్లు, ఏపీఐ అమ్మకాలు 6 శాతం పెరిగి రూ.816 కోట్లకు చేరాయి. పరిశోధన, అభివృద్ధికి ఈ త్రైమాసికంలో రూ.217 కోట్లు ఖర్చు చేశారు. కాగా, సంస్థ అనుబంధ కంపెనీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ... అభివృద్ధి దశలో ఉన్న ఓ ఉత్పాదన, దాని అనుబంధ ఆస్తుల కొనుగోలుకు ఆస్ట్రేలియాకు చెందిన అడ్వెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌తో ఒప్పందం చేసుకుంది. డీల్‌ విలువ సుమారు రూ.91 కోట్లు.



You may be interested

మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.4.8 కోట్ల నష్టం

Tuesday 13th November 2018

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ రూ.4.8 కోట్ల నికర నష్టం పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2.65 కోట్ల లాభం ఆర్జించింది. టర్నోవరు రూ.119 కోట్ల నుంచి రూ.153 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 1.25 శాతం తగ్గి రూ.7.90 వద్ద స్థిరపడింది.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు రూ.6.4 కోట్ల నష్టం

Tuesday 13th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (గతంలో గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌) రూ.6.4 కోట్ల నష్టం చవిచూసింది. కిందటేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1.4 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. టర్నోవరు రూ.47 కోట్ల నుంచి రూ.71 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర క్రితంతో పోలిస్తే 2.87 శాతం పెరిగి రూ.251.25 వద్ద స్థిరపడింది.

Most from this category