News


క్యు2 ఎర్నింగ్స్‌ ఎలా ఉన్నాయ్‌?

Monday 29th October 2018
news_main1540808135.png-21566

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించాయి.

- ఇప్పటివరకు నిఫ్టీ 50లో 27 కంపెనీలు క్యు2 రిజల్ట్స్‌ వెలువరించాయి.

- ఇందులో 16 కంపెనీల ఫలితాలు అంచనాలకు అనుగుణంగా ఉండగా ఐదు కంపెనీలు అంచనాలను మించిన ఫలితాలు ప్రకటించాయి.

- ఆరు కంపెనీలు పేలవ ఫలితాలిచ్చాయి. ఈ దఫా అంచనాలను అందుకోని ఫలితాలు ప్రకటించినవాటిలో ఫైనాన్షియల్‌ సేవల రంగాలకు చెందిన కంపెనీలే ఎక్కువగా ఉన్నాయి. 

రంగాల వారీగా విశ్లేషణ
వ్యవసాయం: ఈ రంగంలో యూపీఎల్‌ వరుసగా మూడో త్రైమాసికంలో సైతం అంచనాలకు తగిన ఫలితాలు ఇచ్చింది. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా ధరల పెరుగుదల గోచరించింది. లాటిన్‌ అమెరికాలో మెరుగుదల యూపీఎల్‌కు పాజిటివ్‌గా మారింది.
ఆటోమొబైల్స్‌: మారుతీ, హీరో, బజాజ్‌ ఆటో అంచనాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాయి. వరుసగా రెండో త్రైమాసికంలో కూడా విక్రయాలు మందకొడిగా నమోదయ్యాయి. పండుగ సీజన్‌ ఆలస్యం కావడం, బలహీన రుతుపవనాలు ఎర్నింగ్స్‌పై ప్రభావం చూపాయి. 
సిమెంట్‌: అల్ట్రాటెక్‌ బహుళ త్రైమాసిక కనిష్ఠ ఎబిటా ప్రకటించింది. వాల్యూంలు బలంగా ఉన్నా కంపెనీలపై మార్జిన్‌ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి.
కన్జూమర్‌ స్టాక్స్‌: హెచ్‌యూఎల్‌, ఐటీసీ ఫలితాలు అనుకున్నట్లే ఉన్నాయి. ఏసియన్‌ పెయింట్స్‌ నిరాశపరిచింది. ఐటీసీ సిగరెట్‌ వాల్యూంలు బలంగా కొనసాగగా, వ్యవసాయ విభాగంలో బలహీన వృద్ధి కనిపించింది. ఏసియన్‌పెయింట్స్‌ వాల్యూంలు బాగున్నాయి.
ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌: రిఫైనింగ్‌ ప్రదర్శన పేలవంగా ఉన్నా, పెట్రోకెమికల్‌ విభాగం బలంగా ఉండడంతో ఆర్‌ఐఎల్ గట్టునపడింది. జియోకు కొత్త వినియోగదారుల చేరిక కొనసాగింది. అయితే ఏఆర్‌పీయూలో క్షీణత నమోదయింది.
ఫైనాన్షియల్స్‌: ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు బలమైన ఫలితాలు చూపింది. బజాజ్‌ ఫైనాన్స్‌ భవిష్యత్‌పై బలమైన నమ్మకం వినిపించింది. యస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకులు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రుణాల ప్రభావం ఫలితాలపై పడింది.
టెక్నాలజీ: విప్రో మినహా ఇతర పెద్ద ఐటీ కంపెనీలన్నీ మంచి ఫలితాలు ప్రకటించాయి. అన్ని కంపెనీలూ మంచి గైడెన్స్‌నే ప్రకటించాయి.
ఫార్మా: యూఎస్‌లో బలహీనంగా ఉన్నా భారతీయ మార్కెట్లో మాత్రం డా.రెడ్డీస్‌ బలమైన ప్రదర్శన చూపింది. 
మీడియా: దేశీయ ప్రచారప్రకటనల ఆదాయంలో బలమైన వృద్ది జీ కంపెనీకి కలిసివచ్చింది. దీంతో మూడు పేలవ త్రైమాసికాల అనంతరం మంచి ఫలితాలు చూపింది. 
టెలికం: అధిక ధరలు, పోటీ ఎయిర్‌టెల్‌ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి.
మెటల్స్‌: జేఎస్‌డబ్ల్యు స్టీల్‌ ఫలితాలు బాగున్నాయి. ఉత్పాదకాల ధరల పెరుగుదల ప్రభావం చూపుతోంది.
పోర్ట్స్‌: కార్గో రెవెన్యూ బాగుండడంతో అదానీ పోర్ట్స్‌ ఫలితాలు అంచనాలను మించాయి. 

 You may be interested

సెన్సెక్స్‌ లాభం 718 పాయింట్లు

Monday 29th October 2018

34 వేల పైకి సెన్సెక్స్‌ 10250 మార్కును అందుకున్న నిప్టీ ముంబై:- ప్రభుత్వరంగ బ్యాంకు, ఫార్మా షేర్ల ర్యాలీ అండతో సూచీలు సోమవారం భారీగా లాభపడ్డాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి సాగిన కొనుగోళ్లకు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు తోడవ్వడంతో సెన్సెక్స్‌ 34 వేల మార్కును, నిఫ్టీ 10250 మార్కును అందుకున్నాయి.  చివరకు సెన్సెక్స్‌ 718 పాయింట్ల లాభంతో 34067 వద్ద నిఫ్టీ 221 పాయింట్లు పెరిగి 10250 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు

పటిష్ట క్యూ2 ఫలితాలతో దివీస్‌ దూకుడు..!

Monday 29th October 2018

క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో పటిష్ట ఫలితాలను సాధించడంతో  దివీస్‌ లేబొరేటరీస్‌ షేరు సోమవారం ఇంట్రాడేలో 52వారాల గరిష్టానికి చేరుకుంది. ఈ క్యూ2లో రూ.398 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో నికరలాభం రూ.రూ. 207 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1285 కోట్లను సాధించింది. ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేయడంతో యాక్సిస్‌ క్యాపిటల్‌, ఈక్వెరస్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను పెంచాయి. ఈ సానుకూల ఫలితాల

Most from this category